బీజేపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు   బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.   భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ ‘మౌన దీక్ష’కు  సిద్ధమయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి  చెందినటు వంటి బీజేపీ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంసహా పలువురు పార్టీ నేతలతో కలిసి ‘మౌన దీక్ష’ చేయనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.  ఉదయం 11 నుండి రాజ్ ఘాట్ వద్ద ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.  

 రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్ ను రాజ్యాంగ ద్రోహిగా దేశ ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లాలని  భావిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.   ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టకూడదని భావిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. దళిత సీఎం విషయంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం, దళిత బంధును ఎన్నికల స్టంట్ గా మార్చడం, దళితులకు మూడెకరాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను కూడా ఈ సందర్భంగా జనం ముందుకు ఉధ్రుతంగా తీసుకెళ్లేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీని ప్రజలు ఆదరిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనానికి లోనవడం.... శాంతిభద్రతలను కాపాడతానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్ అందుకు భిన్నంగా అక్కసుతో తనపైనా బీజేపీ నేతలపైనా దాడులకు పురిగొల్పుతూ భయభ్రాంతులకు గురిచేయాలని చేస్తున్న కుట్రలను కూడా ఈ సందర్భంగా ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: