ఒక మూడు నెలల క్రితం వరకు తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ చుట్టూనే రాజకీయాలు తిరిగాయి..ఆయనపై ఎప్పుడైతే భూ కబ్జాల ఆరోపణలు వచ్చాయో...అప్పటినుంచే ఆయన బాగా హాట్ టాపిక్ అయ్యారు. ఈటలని కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించడం..ఇక ఈటల టీఆర్ఎస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం...హుజూరాబాద్ బరిలో మళ్ళీ నిలబడటం...ఇక ఉపఎన్నిక జరిగి ఫలితం వచ్చేవరకు ఈటల చుట్టూనే అంతా రాజకీయం నడిచింది. అయితే హుజూరాబాద్‌లో ఈటల గెలిచాక... ఈయనే కేసీఆర్‌కు పోటీ ఇచ్చే నాయకుడు అని, బీజేపీలో సీఎం అభ్యర్ధి అని, ఇక ఈటల ఎక్కడా తగ్గరని చెప్పి కథనాలు వచ్చాయి.

మరి ఇప్పుడు ఆ కథనాలకు తగ్గట్టే పరిస్తితి ఉందా? అంటే అబ్బే లేదు కదా అని చెప్పొచ్చు..అసలు ఈటల హవా కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. ఏదో బీజేపీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప..ఆయన ఏదో రాష్ట్ర రాజకీయాలని శాసించే నాయకుడు స్థానంలో మాత్రం కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి కేసీఆర్‌పై నాలుగు విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు తప్ప...రాజకీయంగా దూకుడుగా లేరు.

అసలు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఈటల హవా ఎందుకు సడన్‌గా తగ్గింది..ఆయన ఏమన్నా సైలెంట్ అయ్యారా? లేక ఎవరైనా సైలెంట్ చేశారా? అనే అనుమానం కూడా వస్తుంది. చెప్పాలంటే రాజకీయంగా ఏ నాయకుడుకైన ఇంకా బలపడాలనే ఉంటుంది. అంటే ఈటలని కావాలని ఆపినట్లు తెలుస్తోంది.

మొదట ఈటల పేరుని టీఆర్ఎస్ నేతలు వాడటం లేదు..ఆయన హవా తగ్గించేందుకే బండి సంజయ్‌ని టార్గెట్ చేశారని కూడా అర్ధమవుతుంది. ఏకంగా కేసీఆర్ సైతం బండినే టార్గెట్ చేశారు..దీంతో బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లు వార్ నడుస్తోంది. ఇక బీజేపీలో కూడా ఈటలది పెద్ద పాత్ర అన్నట్లు లేదు. అక్కడ కూడా కొంతవరకే పరిమితమయ్యారు. అంటే ఈటల రాజేందర్‌ని రాజకీయంగా బాగా తగ్గించినట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: