ఇక చాలా కాలం నుంచి స్వీడన్ విధుల్లో ప్రజలు ఎడా పెడా సిగరెట్లను తాగేసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.అయితే వాటిని తొలగించి వీధులను శుభ్రం చేయాలంటే అక్కడి పారిశుధ్య విభాగాలకు ఇప్పుడు చాలా కష్టతరంగా మారింది. పైగా దీని వల్ల అక్కడి ప్రభుత్వానికి భారీ ఖర్చు కూడా అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆ నగరంలోని స్వీడన్ టైడీ ఫౌండేషన్ అనే సంస్థ కాస్త స్మార్ట్గా ఆలోచించింది. ఇక ఆ సంస్థ వారు అక్కడికి కొన్ని కాకులను తీసుకువచ్చి వాటికి సిగరెట్ పీకలను ఎలా సేకరించాలో ట్రైనింగ్ ఇచ్చారట. ఆ తరువాత వాటిని రంగంలోకి దింపారట.

దాంతో ఆ కాకులు ఇక విధుల్లో పడి ఉన్న సిగరెట్ పీకలను సేకరించి.. ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించిన స్పెషల్ మిషన్ లో వేస్తాయి. అప్పుడు మరో మిషన్ నుంచి వాటికి కొంచెం కొంచెంగా ఆహారం అనేది లభిస్తుంది. అలాగే శిక్షణ పొందిన కాకులను చూసి మరికొన్ని కాకులు కూడా పని నేర్చుకున్నాయట. దీంతో ఇప్పుడు వందలాది కాకులు స్వీడన్ విధుల్లో ప్రజలు తాగి పడేసిన సిగరేట్లను తొలగించి ఆహారాన్ని సంపాదించుకోవడమే కాకుండా అక్కడి ప్రభుత్వానికి ఆసరాగా ఉండి బోలెడంత ఖర్చుని తగ్గిస్తున్నాయి. కాకులు చేస్తున్న ఆ పని వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా ఏకంగా డబ్బై శాతం ఖర్చు అనేది తగ్గుతుందట.

ఇక ఈ పనికి కాకులనే ఎందుకు ఎంచుకున్నారు అనే అనుమానం కూడా ఇక్కడ చాలా మందికి రావొచ్చు.. అయితే అందుకు కారణం అనేది ఇక్కడ లేకపోలేదు. కాకులు చాలా చాలా తెలివైనవి. పైగా వాటికి శిక్షణ ఇవ్వడం కూడా ఎంతో సులువు అట . అందుకే ఆ సదరు సంస్థ వారు ఈ కాకులను తమ అవసరం కోసం ఎంచుకున్నారు.ఈ రకంగా కాకులు జాబ్ చేస్తూ తమ ఆహారాన్ని సంపాదించుకొని తింటున్నాయి. రియల్లీ గ్రేట్ కదూ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: