మంచి చేయడానికి వయసుతో పని ఏముంది.. గొప్ప మనసు ఉండాలి కానీ. ఎవరి ప్రాణం పోతే మనకెందుకు మనం సంతోషంగా ఉన్నామా లేమా అన్నది ముఖ్యం అని అనుకుంటున్న నేటి రోజుల్లో కూడా కొంతమంది ఇంకా మానవత్వం బ్రతుకుంది అనడానికి నిదర్శనంగా మారిపోతున్నారు. చనిపోతూ కూడా పది మందికి ప్రాణం పోయడం ముఖ్యం అంటూ ఎంతో గొప్ప మనసు చాటుకుంటున్నారు. అవయవ దానం చేస్తే చనిపోయిన కూడా ఇంకా ఎంతో మందికి ప్రాణం పోయవచ్చు అని అందరికీ తెలుసు. కానీ అవయవ దానం చేయడానికి నేటి రోజుల్లో ఎవరూ ముందుకు రావడం లేదు.


 కానీ ఇక్కడ ఒక బాలుడు మాత్రం చనిపోతూ కూడా ఇతరులకు  ప్రాణం పోసి ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతున్నాడు. 14 ఏళ్ల వయసులోనే అతనికి నూరేళ్ళు నిండిపోయాయి. ఇంత మంచి వాడు భూమ్మీద ఎందుకు అనుకున్నాడో ఏమో దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళి పోయాడు. చనిపోతూ వెలకట్టలేని దానం చేశాడు. అవయవదానంతో ఏకంగా ఏడుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు 14 ఏళ్ల బాలుడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..టి మాదాపూర్  కు చెందిన రాములు మంజుల దంపతులకు లోకేష్ అనే కొడుకు ఉన్నాడు.


 స్థానికంగా ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు లోకేష్. ఇక అంతా సాఫీగా సాగిపోతున్న అనుకుంటున్న సమయంలో ఇటీవలే స్కూల్ కు వెళుతుండగా మాదాపూర్ వద్ద వ్యాన్ ఢీ కొట్టింది. ఇక ఈ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన లోకేష్ ని తల్లిదండ్రులు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే బ్రెయిన్డెడ్ కావడంతో చివరికి లోకేష్ మృతి చెందాడు. ఇక అదే సమయంలో అక్కడే ఉన్న జీవన్ దాన్ ప్రతినిధులు లోకేష్ కుటుంబ సభ్యులు అవయవదానం విశిష్టతను వివరించారు. తల్లిదండ్రులు అంగీకారంతో ఆ బాలుడు నుంచి కాలేయం రెండు మూత్రపిండాలు ఊపిరితిత్తులు కళ్లను సేకరించారు. ఇక పేద కుటుంబం అయినప్పటికీ పెద్ద మనసుతో అవయవ దానానికి ముందుకు వచ్చిన ఆ బాలుడు తల్లిదండ్రులను జీవన్దాన్ సభ్యులు అభినందించారు. ఇక ఆసుపత్రి వైద్యులు సైతం బాలుడు పార్ధివ దేహం పై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: