రాజకీయంగా గంటా శ్రీనివాసరావు ఎంత పేరున్న నాయకుడో చెప్పాల్సిన పని లేదు...విశాఖపట్నంలో రాజకీయంగా తిరుగులేని నాయకుడు..ఎన్నో ఏళ్లుగా అక్కడ విజయవంతంగా రాజకీయాలు నడిపిస్తున్నారు..ఎన్నడూ ఓటమి లేకుండా ముందుకెళుతున్నారు...ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా రాజకీయాన్ని మార్చి లాభం పొందడంలో గంటాకు సాటి ఎవరులేరని చెప్పొచ్చు. ఇటీవల కూడా రాజకీయంగా లాభం పొందడమే లక్ష్యంగా గంటా ముందుకెళుతున్నట్లే కనిపిస్తోంది.

అసలు రాజకీయ లబ్ది లేకుండా గంటా ఎలాంటి రాజకీయం చేయరన్నట్లే పరిస్తితి ఉంది...గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి గంటా...పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే...వైసీపీ అధికారంలోకి రావడంతో రాజకీయంగా ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో అని ఉద్దేశంతో గంటా టీడీపీకి దూరంగా ఉంటున్నారు...పైగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలని చూసిన సంగతి తెలిసిందే.

మరి వైసీపీలోకి వెళ్ళడం గంటాకు ఎందుకు కుదరలేదో  అందరికీ తెలిసిందే...సరే వైసీపీలోకి వెళ్లడానికి కుదరని గంటా ఈ మధ్య టీడీపీలో కాస్త యాక్టివ్ అయ్యారు...అదే సమయంలో కాపులకు అధికారం దక్కాలని చెప్పి గంటా సెపరేట్‌గా రాజకీయం చేస్తున్నారు...ఈ మధ్య కాపు నేతలందరూ కలిసి వరుసపెట్టి సమావేశం అవుతున్నారు..తాజాగా విశాఖలో కొందరు కాపు నేతలు, కాపు వర్గానికి చెందిన మాజీ అధికారులు సమావేశమయ్యారు..ఈ సమావేశం గంటా ఆధ్వర్యంలోనే జరిగింది..అయితే గంటా టీడీపీకి అనుకూలంగా సమావేశం పెట్టారా? లేక ఎందుకు పెట్టారా? అనేది సరిగ్గా క్లారిటీ లేదనే చెప్పాలి.

కాకపోతే ఆ సమావేశంలో జగన్ ప్రభుత్వం వైఖరిపై విమర్శలు వచ్చాయి..అంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంటా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. కానీ గంటా రాజకీయాన్ని తెలుగు తమ్ముళ్ళు మాత్రం నమ్మడం లేదు...గంటా రాజకీయంలో ఏదో తేడా ఉందని చెప్పి తమ్ముళ్ళు మాట్లాడుకునే పరిస్తితి ఉంది. గంటా కాపు సమావేశాలు టీడీపీ కొంపముంచేలా ఉన్నాయని అనుకుంటున్నారు..పైగా గంటా ఆధ్వర్యంలో కొత్త పార్టీ వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఏదేమైనా గంటాని నమ్మడానికి లేదని చెప్పి టీడీపీ తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: