దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధిపత్యానికి మరో సారి తెరలేచింది. కొద్ది రోజుల క్రితం దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బీజేపీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఇక పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి కోల్పోయింది. దీనితో దేశ రాజకీయాలు ఎంతో ఉత్కంఠగా మారాయి. గత ఎన్నికల వరకు కాంగ్రెస్ మరియు బీజేపీ లు ప్రత్యర్ధులు అనుకున్న దేశ ప్రజలకు ఈ ఎన్నికల ఫలితాలతో ఒక క్లారిటీ వచ్చేసింది. దేశ రాజకీయాలలో ముందు ముందు కాంగ్రెస్ ఆధిపత్యం ఉండదని మిగిలిన రాజకీయ పార్టీలకు ఒక సందేశం ఇది. అయితే ఎంతో విజయవంతమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంత దారుణమైన ఫలితాలు రావడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యముగా అధికారంలో ఉన్న పంజాబ్ లో ఒక స్థానిక పార్టీకి అధికారం కోల్పోవడం అన్నది నిజంగా బాధాకరమైన విషయంగా చెప్పాలి.

* పంజాబ్ లో కాంగ్రెస్ కు ముందుగా సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ కు మరియు గతంలో కాంగ్రెస్ లోకి వచ్చిన ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుకు మధ్యన విభేదాలు రావడం. అయితే వచ్చిన విభేదాలను వెంటనే పరిష్కరించకుండా కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూడడం ఒక పెద్ద సమస్యగా మారింది.

* ఆ తర్వాత పంజాబ్ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అమరీందర్ సింగ్ నిర్ణయాన్ని కాదని సిద్దును ఎంపిక చేయడంతో అది కాస్తా బాగా ముదిరిపోయింది.

* అయితే పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక అయిన సిద్దు పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో పూర్తిగా విఫలం అయ్యాడు.

* ఈ వివాదంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎం అమరీందర్ సింగ్ ను ఖాతరు చేయకుండా సిద్ధునే హైలైట్ చేస్తూ వచ్చింది. దీనితో మనస్థాపానికి గురయిన అమరీందర్ సింగ్ సీఎం పదవి నుండి తొలగిపోయి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడు.

* ఈ పార్టీ కూడా పంజాబ్ కాంగ్రెస్ ఓటర్లను అయోమయానికి గురిచేసింది. కాంగ్రెస్ కు పాస్లయినా ఓట్లు అన్నీ చీలిపోయి రెండు పార్టీలకు పడడంతో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్లస్ గా మారింది.

ఇలా పలు కారణాల వలన పంజాబ్ లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది..
 


మరింత సమాచారం తెలుసుకోండి: