ఓవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంటే.. అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టిస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్‌లో పర్యటిస్తున్నారు. జోబైడెన్ ప్రస్తుతం యూరప్ పర్యటన ఉన్నారు. ఆ టూర్‌లో భాగంగానే బైడెన్ పోలాండ్‌కు వెళ్లారు. ప్రస్తుతం పోలండ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్న ప్రాంతం.. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నమాట.


ఉక్రెయిన్‌ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్‌లోని రెజెస్‌ జో నగరంలో ప్రస్తుతం  బైడెన్‌ ఉన్నారు. పోలాండ్- ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న అమెరికా సైన్యంతో బైడెన్‌ మాట్లాడతారు. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు భారీగా వలసలు వస్తున్నారు. రష్యాలో ఉండలేక.. ప్రాణాలు కాపాడుకుంటే చాలని చాలామంది పొరుగున ఉన్న పోలెండ్‌కు వలస వెళ్తున్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చి.. ఆదుకునే అంశంపైనా బైడెన్ పోలండ్‌తో చర్చించే అవకాశం ఉంది.


ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులను ఆదుకుంటామని గతంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా సైన్యం, ప్రభుత్వేతర సంస్థలు ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు వచ్చే వారికి ఇప్పటికే పోలండ్‌లో సహాయం చేస్తున్నాయి. అయితే జో బైడెన్ యూరప్ పర్యటనపై రష్యా ఆగ్రహంగా ఉంది. అందులోనూ ఉక్రెయిన్ పొరుగునే ఉన్న పోలండ్‌కు జో బైడెన్‌ రావడాన్ని మాస్కో తీవ్రంగా పరిశీలిస్తోంది.


రష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడుతున్న సమయంలో జో బైడెన్ ఇలాంటి పర్యటన పెట్టుకోవడాన్ని రష్యా నిఘా సంస్థలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు సాయం అందించే అంశాన్ని కూడా అమెరికా తీవ్రంగా పరిశీలిస్తుండటం.. మరోవైపు యుద్ధం మొదలై నెల రోజులు గడుస్తున్న ముగింపు లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో జో బెడెన్ పోలండ్ పర్యటన చర్చనీయాంశం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: