తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండి పోతున్నాయి.. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది భానుడి ప్రతాపం కాస్త ఎక్కువగా ఉందని అందరికి తెలిసిందే.. వర్షం కురిసి కాస్త చల్ల బడితే బాగుండు అని అందరూ అనుకున్నారు. ఆ సమయం వచ్చిందని చెప్పాలి. ఏపీలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు వాతావరణ అధికారులు అంటున్నారు.. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీచడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలలో ఉష్ణోగ్రతలు దిగొస్తున్నాయి..


ఈరోజు నుంచి మరో రెండు రోజులు పాటు రాష్ట్రం లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలుస్తుంది. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో ఓ మోస్తరు వర్షాలు కురవడం వల్ల రాయలసీమలో వేడి థగ్గిందని తెలుస్తుంది. దీని వల్ల ఎపి తో పాటుగా, తెలంగాణాలో కూడా వాతావరణం చల్లబడినదని అధికారులు అంటున్నారు. రాయలసీమ, కోస్తా లో గత కొన్ని రోజులుగా మండి పోతున్న ఎండలు నిన్నటి నుంచి భారీగా కిందకు దిగి వచ్చాయని నిపుణులు అంటున్నారు.. 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడనున్నాయి. చిత్తూరు తో పాటుగా మరి కొన్ని జిల్లాల్లో జల్లులు పడనున్నాయని నిపుణులు అంటున్నారు..


మరో వైపు తెలంగాణాలో కూడా ఉష్ణోగ్రతలు దిగొస్తున్నాయి.. ఈ మధ్య కాలంలో 40 దాటిన ఉష్ణోగ్రతలు నేడు చల్ల బడ్డాయని అంటున్నారు. ఏపీలో వర్షాల ప్రభావంలో రెండు మూడు రోజులపాటు తెలంగాణ లో చలి గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం మబ్బులు ఏర్పడ్డాయి.. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడ గాలుల ప్రభావం తగ్గడం తో ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. మొత్తానికి రెండు రోజులు పాటు వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: