ఎలాగూ గెలవదని ఫిక్సయిపోయారో లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేస్తే గెలవచ్చని అనుకున్నారో తెలీటంలేదు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త అభ్యర్ధిని ట్రై చేయాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యారట. మొదటినుండి ఈ నియోజకర్గంలో కమ్మ అభ్యర్ధే పోటీచేస్తున్నారు. కొన్నిసార్లు గెలుపు అత్యధికసార్లు ఓటమి తప్పటంలేదు. కానీ గడచిన నాలుగు ఎన్నికల్లో పార్టీ ఎవరిని పోటీచేయిస్తున్నా వరుసగా ఓడిపోతున్నారు.





ఏ అభ్యర్ధిని పోటీచేయించినా ఓడిపోతుండటంతో చంద్రబాబుకు విసిగిపోయినట్లున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో ఎలాగైనా గుడివాడను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. వ్యక్తిగతంగా తనతో పాటు కొడుకు లోకేష్ ను నానా మాటలంటున్న కొడాలినానిని ఎలాగైనా ఓడించాలనే పంతమైతే చంద్రబాబులో పెరిగిపోతోంది. ఓడించాలనే పంతం పెరిగిపోతోంది కానీ అందుకు మార్గాలు మాత్రం కనబడటంలేదు. పార్టీలోని నేతలపై పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లే అనుమానంగా ఉంది.





అందుకనే కొత్తగా బయటవ్యక్తిని ట్రై చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. శిష్ట్లా లోహిత్ అనే కుర్రాడిని ట్రై చేస్తే ఎలాగుంటుందని అనుకుంటున్నారట. లోహిత్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ తో పాటు ఇతరత్రా కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడట. బ్రాహ్మణ సామాజికవర్గంలోనే కాకుండా కొందరు కమ్మ సామాజికవర్గం వారితో కూడా బాగా సన్నిహిత సంబంధాలున్నాయట.





కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీ నేతను కాకుండా రాజకీయాలకు ఫ్రెష్ అయిన లోహిత్ ను పోటీచేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గెలిస్తే ప్రయోగం సక్సెస్ అయినట్లు. ఒకవేళ ఓడిపోతే ఎలాంటి నష్టమూలేదు. ఎందుకంటే ఎలాగూ ఓడిపోయే సీటే కాబట్టి కనీసం ప్రయోగం చేసినట్లన్నా ఉంటుందనే ఆలోచనట. లోహిత్ కు పార్టీ మొత్తం అండగా నిలిచి ఎన్నికల్లో కొడాలిపై పోరాటం చేయాలని చంద్రబాబు ఇప్పటికే అంతర్గత సమీక్షల్లో చెప్పారట. మహానాడు సందర్భంగా ఈ విషయాన్ని గుడివాడ నేతల దగ్గర ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట. మరి లోహిత్ ను పోటీచేయించే విషయంలో చంద్రబాబు ఎంతవరకు గట్టిగా ఉంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: