జగన్మోహన్ రెడ్డిపై నెగిటివ్ ముద్ర వేయటానికి చంద్రబాబునాయుడు కొత్త వ్యూహం పన్నారు. అదేమిటంటే జగన్ ది ఐరన్ లెగ్ అన్నపదాన్ని పదే పదే కాయిన్ చేస్తున్నారు. మూడురోజులుగా జరుగుతున్న పర్యటనల్లో ఎక్కడికి వెళ్ళినా జగన్ ది ఐరన్ లెగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. చంద్రబాబు మొదలుపెట్టారు కాబట్టి ఎల్లోమీడియా కూడా అదే పద్దతిలో ముందుకు వెళుతుందనటంలో సందేహంలేదు. అంతా బాగానే ఉంది నిజంగా జగన్ ది ఐరన్ లెగ్గేనా ?





అసలు ఐరన్ లెగ్ అని ఎవరినంటారు ? ఎవరినంటారంటే ఒక వ్యక్తి ఏరంగంలో అడుగుపెట్టినా నష్టాలు వస్తుంటే లేదా నెగిటివ్ ఫలితాలే వస్తున్నా సదరు వ్యక్తిని ఐరన్ లెగ్ అనంటారు. అయితే చంద్రబాబు చెబుతున్నట్లు జగన్ ది నిజంగానే ఐరన్ లెగ్గేనా ? కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినదగ్గర నుండి జగన్ కు అపారమైన ప్రజాభిమానం కనబడుతునే ఉంది. 2014 ఎన్నికల్లో 67 సీట్లే తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయంసాధించారు.





అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో, బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ గెలిచింది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసింది. ఏరకంగా చూసుకున్నా పార్టీ మంచి జోరుమీదుంది. వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. కాబట్టి జగన్ ది ఐరన్ లెగ్ కాదని అర్ధమైపోతోంది. ఇక కరోనా వైరస్ అంటారా అది ప్రపంచమంతా ఇబ్బంది పడింది. ఆర్ధిక పరిస్ధితి ఘోరంగా ఉందంటే అందులో చంద్రబాబు పాత్ర కూడా బాగానే ఉంది. ఎందుకంటే మొదట సీఎం అయ్యింది చంద్రబాబే కాబట్టి.





ఇక చంద్రబాబు విషయం చూస్తే ఈయన ఎప్పుడు సీఎం అయినా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టే. చంద్రబాబు పాలనలో తుపానులు, కరువు రెగ్యులర్ గా వస్తునే ఉంటాయి. గడచిన మూడేళ్ళల్లో చంద్రబాబు నాయకత్వంలో పార్టీ ఎక్కడ పోటీచేసినా ఓటమే. భవిష్యత్తులో కోలుకుంటుందన్న నమ్మకం కూడా చాలామందిలో లేదు. మరిద్దరిలో ఐరన్ లెగ్ ఎవరు ? జనాలే తేల్చుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: