ఈ మధ్య జనాలు తమకు ఇష్టమైన వ్యక్తి, రాజకీయ నేతల ఫోటోలను పచ్చగా వేయించుకున్న సంఘటనలు ఈ మధ్య చాలానే వెలుగులోకి వచ్చాయి..వాటికి జనాలు కూడా వివిధ రకాలుగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు.. ఇది ఇలా వుండగా తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యలు వివాదాలకు, విమర్శలకు దారి తీసింది.అంతేకాదు రాజకీయాల్లో చిచ్చు  పెట్టిన సంగతి అందరికి తెలుసు.. దేశ వ్యాప్తంగా చెలరేగిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి.

 
ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముస్లిం యువకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బొమ్మను టాటూ వేయించుకున్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. యూపీలో ని ఈటా జిల్లా అలీగంజ్ తాలూకా లోని కస్బ సరై అఘాత్ ప్రాంతానికి చెందిని ఓ యువకుడు యామీన్ సిద్దిఖీ.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే ఈ యువకుడి కి ఎంతో ఇష్టం. ఆయనే తన రోల్ మోడల్ అని సిద్దిఖీ చెప్పుకొచ్చాడు. యోగిపై అతనికి ఎంత అభిమానమంటే ఆయన ఫొటోను ఛాతి పై టాటూ వేయించుకున్నాడు.



ఈ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. సిద్దిఖీ అనే ఈ యువకుడు ఒక ఫుట్‌వేర్ వ్యాపారి. ఒకప్పుడు సమాజ్‌వాదీ జెండా మోసిన ఇతను యోగి ప్రభుత్వ పనితీరు నచ్చి అతనికి పెద్ద అభిమానిగా మారాడని చెబుతున్నాడు.. సీఎం యోగి నేరస్తుల నుంచి పేదవారిని కాపాడుతున్నాడని, మంచి పనులు చేస్తున్నారని ఈ యువకుడు పోగుడుతున్నాడు.. ఆకతాయిల పై చర్యలు తీసుకోవడం లో యోగి ఆదిత్యనాథ్ అస్సలు ఆలస్యం చేయరని, అందుకే అతని ముఖాన్ని ఇలా టాటూ వేయించుకున్నాడు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చెయ్యడం తో సోషల్ మీడియా లో తీవ్ర ప్రచారం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: