జగన్మోహన్ రెడ్డి-రామోజీరావుల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా మండుతున్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు రాజకీయప్రయోజనాలను పరిరక్షించటమే ధ్యేయంగా ఎల్లోమీడియా జగన్ కు నూరుశాతం వ్యతిరేకంగా పనిచేస్తోంది. జగన్-ఎల్లోమీడియా వ్యవహారం ఎలాగుందంటే అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమంటే రాజకీయపార్టీలా లేకపోతే ఎల్లోమీడియానే అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. ఇలాంటి నేపధ్యంలో చాలా సైలెంటుగా రామోజీకి జగన్ చాలా పెద్ద షాకే ఇచ్చారు.


మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో సుప్రింకోర్టు సోమవారం రామోజీరావుకు నోటీసులిచ్చింది. నాలుగువారాల్లో నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని సుప్రింకోర్టు స్పష్టంగా ఆదేశించింది. సుప్రింకోర్టు నుండి రామోజీకి నోటీసులు వచ్చాయంటే అందుకు కారణం ప్రభుత్వమే. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మార్వదర్శిపై ఉండవల్లి ఒక్కళ్ళే పోరాటం చేస్తే వెయిట్ సరిపోవటంలేదు.

ఈరోజో లేకపోతే రేపో కేసు కొట్టేస్తారని అందరు అనుకుంటున్న సమయంలో రాష్ట్రప్రభుత్వం చివరి నిముషంలో ఉండవల్లి వేసిన కేసులో ఇంప్లీడయ్యింది. ఎప్పుడైతే ప్రభుత్వం ఇంప్లీడయ్యిందో ఉండవల్లి వేసిన కేసుకు, చేస్తున్న పోరాటానికి మంచి లైఫ్ వచ్చినట్లయ్యింది. తనకు వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం కేసులో ఇంప్లీడయ్యిందనే అక్కసును రామోజీ తట్టుకోలేకపోయారు. అందుకనే పాత కతలన్నింటినీ తిరగరాస్తు మొదటిపేజీలో బ్యానర్ కథనాలుగా అచ్చేస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా రామోజీ ప్రతిరోజూ రెచ్చిపోతుంటే జగన్ మాత్రం చాలా సైలెంట్ గా రామోజీకి పెద్ద షాకిచ్చారు.


అసలు మార్గదర్శి కేసుకు మూలకారణమైన మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకారమైతే మార్గదర్శి చిట్ ఫండ్ నిర్వహణే మొత్తం మోసం. జనాలనే కాదు ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా రామోజీ మోసం చేసి డిపాజిట్లు కలెక్ట్ చేశారట.  చట్టాలను ఉల్లంఘించి ఇటు ప్రభుత్వాన్ని అటు జనాలను కూడా రామోజీ మోసం చేశారనేది ఉండవల్లి ప్రధాన ఆరోపణ. చేసిన మోసం నిరూపణైతే రామోజీకి జైలుశిక్షతో పాటు సుమారు రు. 6500 కోట్ల జరిమానా చెల్లించాల్సుంటుందని ఉండవల్లి చెప్పారు. కేసు గనుక ఫైనల్ అయిపోతే ఏమవుతుందో చూడాలి.మరింత సమాచారం తెలుసుకోండి: