వచ్చేఎన్నికల్లో పోటీచేయటం మాటేమిటో కానీ చంద్రబాబునాయుడుపై నాలుగువైపులా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. మిగిలిన నేతల మాటెలాగున్నా నందమూరి కుటుంబం నుండే వచ్చే ఎన్నికల్లో మరో ఇద్దరు పోటీచేయటానికి రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హిందుపురంలో నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎంఎల్ఏగా ఉన్నారు. బాలయ్యకు తోడు వచ్చేఎన్నికల్లో నందమూరి చైతన్య కృష్ణ, నందమూరి తారకరత్న కూడా పోటీలోకి దిగాలని డిసైడ్ అయ్యారట.





చైతన్య ఏమో తాత, పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ పోటీచేసిన గుడివాడ నుండే రంగంలోకి దిగటానికి రెడీ అవుతున్నారట. ఇక తారకరత్న ఎక్కడినుండి పోటీచేసేది తెలీదుకానీ ఎన్నికల్లో పోటీచేయటమైతే ఖాయం. తాను పోటీచేయబోతున్నట్లు స్వయంగా తారకరత్నే ఈమధ్య ప్రకటించారు. తన పోటీగురించి ప్రకటించటమే కాకుండా తన సోదరుడు జూనియర్ ఎన్టీయార్ పార్టీకి ప్రచారం చేస్తారని కూడా చెప్పేశారు. తారకరత్న పోటీచేయటం తనిష్టం కాబట్టి ఎలాంటి సమస్యాలేదు.





అయితే జూనియర్ పార్టీకి ప్రచారం చేస్తారని ప్రకటించటమే విడ్డూరంగా ఉంది. చాలాకాలంగా జూనియర్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ముందుజాగ్రత్తగా చంద్రబాబే కొడుకు లోకేష్  కోసం జూనియర్ ను పార్టీ దరిదాపుల్లోకి కూడా రానీయటంలేదు. జూనియర్ గనుక పార్టీలో యాక్టివ్ గా ఉంటే కొడుకును ఎవరూ పట్టించుకోరని చంద్రబాబుకు బాగా తెలుసు. కాబట్టి అవసరానికి వాడుకుని యూజ్ అండ్ త్రో పాలసీని అప్లై చేయాలని చంద్రబాబు అనుకున్నారు. ఈ విషయం అర్ధమైంది కాబట్టే జూనియర్ అసలు పార్టీ దగ్గరకే రావటంలేదు.





పార్టీలోని చాలామంది సీనియర్లు జూనియర్ ప్రస్తావనతో చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారు. జూనియర్ ను పార్టీలో యాక్టివ్ చేయకపోతే పార్టీకి భవిష్యత్తు లేదని పదేపదే చెబుతున్నారు. అలాంటిది ఇపుడు తారకరత్న కూడా అలాంటి ప్రకటనే చేయటం చంద్రబాబుకు కచ్చితంగా చికాకు పుట్టించేదే. జూనియర్ పేరెత్తితేనే తండ్రి, కొడుకులకు ఎంత మంటగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది పదేపదే జూనియర్ వస్తారు పార్టీకి ప్రచారం చేస్తారు, యాక్టివ్ గా ఉంటారని చెప్పటంలో చంద్రబాబుపై ఒత్తిడి పెంచటమనే అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: