దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ తెలుగు రాష్ట్రాలలోనూ వృద్ధిలోకి రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రజల్లోకి వెళ్లే బలమైన నేత లేనప్పుడు ఏ పార్టీ అయినా తొలిదశలోనే ఆగిపోవాల్సిందే. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కూడా బీజేపీ పరిస్థితి అంతే.. కానీ ఏపీలో కన్నా తెలంగాణాలో బీజేపీ కాస్త నయం అని చెప్పాలి. ఏపీలో ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్న విషయం తెలిసిందే. ఈయనకన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ సరిగా పనిచేయడం లేదన్న నెపంతో సోము వీర్రాజును నియమించడంతో అప్పటి నుండి వీరిద్దరికీ అస్సలు కుదరలేదు.

అయితే ఇంతకాలం ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చాడు కన్నా లక్ష్మీనారాయణ... కానీ ఇంతకాలం తర్వాత ఒక కఠినమైన నిర్ణయం దిశగా వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజలలోకి దూసుకు వెలుతూ, వారి అభిమానాన్ని పొందుతున్న జనసేన పార్టీలోకి కన్నా జంప్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడట. ఈ వార్త గత వారం పది రోజులుగా హల్ చల్ చేస్తోంది. అలా ఈ వార్త బీజేపీ అధిష్టానం వద్దకు వెళ్లడంతో వెంటనే బీజేపీ కార్యనిర్వాహక కార్యదర్శి శివ ప్రకాష్ జి ని రంగంలోకి దించాడు. ఇటీవల శివ ప్రకాష్ భేటీ అయ్యి కన్నాను శతవిధాలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. అందుకోసం ఒక కీలక పదవిని కూడా ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ అధిష్టానం కన్నాను పదవి ఇచ్చి సంతృప్తి పరిచి పార్టీలో ఉంచుకుంటుందా ? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కన్నా లక్ష్మీనారాయణ అనుచరుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం జనసేనలోకి వెళ్లడం పక్కా అట. మరి ఈ విషయం ఏ విధంగా ఫైనల్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. బీజేపీలో కన్నా ఉంటాడా ? ఊడతాడా ? చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: