మొన్న కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఓటమి వెనకాల బీజేపీ పై అక్కడ వ్యతిరేకత బలంగా ఏమీ లేదని తెలుస్తుంది. తగ్గిన ఓట్లు కూడా అక్కడ తక్కువ శాతంలోనే కనిపిస్తున్నాయట. దీనికి బలమైన కారణం అక్కడ మోడీ పర్యటనే అని తెలుస్తుంది. మరి బిజెపి ఓడిపోవడానికి కారణాల గురించి చెప్పాల్సి వస్తే గాలి జనార్ధన్ రెడ్డి కొట్టిన దెబ్బ ఒకటైతే, యడ్యూరప్ప కొట్టిన దెబ్బ మరొకవైపు కారణం అని తెలుస్తుంది.


యడ్యూరప్ప తన కులం వాడే కదా అని, ఏ నిర్ణయము సరైన రీతిలో తీసుకోలేని బొమ్మయ్ అనే వ్యక్తిని ప్రజల ముందు పెట్టినందుకు ఈ ఎదురైన దెబ్బ అని తెలుస్తుంది. బొమ్మయ్ ఏ విషయంలోనూ యాక్టివ్ గా లేకపోయాడని, లింగాయత్తులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడని అంటున్నారు. లింగాయత్తుల నుండి ఎక్కువగా వ్యతిరేకత వచ్చినట్లుగా తెలుస్తుంది. వాళ్లు ఓటు వేయలేదని తెలుస్తుంది.


ఇక్కడ జెడిఎస్ ఓట్లను లాక్కోగలిగింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ లెక్కల ప్రకారం  బిజెపికి 2018 లో 104 స్థానాలు వచ్చాయని ఇప్పుడు 68 మాత్రమే వచ్చాయని తేలుతుంది. 2023లో 36% ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. అయితే ఈ ఓట్ల శాతం 2018 లో 36.5% గా ఉందని ఇప్పుడు 36% వచ్చాయి కాబట్టి 0.5 శాతం మాత్రమే తగ్గాయని తెలుస్తుంది.  ఈ 0.5% తగ్గుదలతో 39 సీట్లను కోల్పోయిందని తెలుస్తుంది.


కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. గతంలో అయితే 80 సీట్లు వచ్చాయని తెలుస్తుంది. ఓట్ల శాతం 42.9, కిందటిసారి 38.4 ఇక్కడ ప్లస్ 48.5 అని తెలుస్తుంది. ఈ 4.5 ఎక్కడ నుంచి వచ్చాయంటే జేడిఎస్ నుంచి వచ్చాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు జెడిఎస్ కి 19% అయితే, గతంలో 38% ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది.  ఓట్ల శాతం ఇప్పుడు 13.3 అయితే గతంలో 18.3 అని తెలుస్తుంది. ఇందులో కూడా 0.5 శాతం ఇతరులు క్యాప్చర్ చేశారన్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP