అసలే ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ తో సఫర్ అవుతుంది పాకిస్తాన్. ఇలాంటి సందర్భంలో మూలిగే నక్క పైన తాటి పండు పడినట్లుగా ఇంకొక దారుణమైన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ వల్ల అక్కడ రైళ్లు ధ్వంసం అయ్యాయి, మిలటరీ కార్యాలయాలు ధ్వంసం అయ్యాయి, బస్సులు ధ్వంసం అయ్యాయి. రోడ్లపై వాహనాలు ధ్వంసం అయ్యాయి.  కానీ అక్కడ మరో దారుణమైన పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ విభజనకు కారణమైనటువంటి, అసలు పాకిస్తాన్ దేశం తయారవ్వడానికి కారణమైనటువంటి మహమ్మద్ ఆలీ జిన్నా సమాధి కూడా ధ్వంసం చేసేసారట.


అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా కైబర్ ఫక్తూనియా ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ తో పాటు తెహ్రిన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ కి కూడా పట్టు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ తెహరీన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ ఇప్పుడు తెహరిన్ కి  జిహాదీ పాకిస్తాన్ అనే మరో విభాగాన్ని పెంచుకుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఈ జిహాదీ పాకిస్తాన్ వాళ్ళు తాము చనిపోతూ పది మందిని చంపేసే రకం అని తెలుస్తుంది. తాజాగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సైన్యంపై పడి 40 మందిని చంపేశాం అన్నట్లుగా వాళ్లకు వాళ్లే ప్రకటించుకున్నారు.


అయితే అక్కడ ఐఎస్పిఆర్ పాకిస్తాన్ కు సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్ విభాగం వాళ్లు కూడా నలుగురు చనిపోయారని తెలుస్తుంది. వాళ్లు కూడా సైన్యం కాదు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలు అని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ తెహరీన్ కి తాలిబన్ జిహాద్ పాకిస్తాన్ వాళ్ళు ఒక వీడియోను రిలీజ్ చేశారు.


అందులో వాళ్ళు చెప్పేదేంటంటే మేము సైన్యం పై దాడి చేస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేక 40 మంది దాడిలో చనిపోయారని, వాళ్ళు వాడిన ఆయుధాలను చూపిస్తూ టెలిగ్రామ్ ఛానల్స్ లో పోస్ట్ చేశారు. దీంతో బిత్తర పోవడం పాకిస్తాన్ పని అయ్యింది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: