గతంలో పార్టీల తీరు ఎలా ఉన్నా, ఆ తర్వాత పార్టీకి ఒక న్యూస్ పేపరు సపోర్ట్ చేయడం అనేది ఉండేది. ప్రస్తుతం అయితే ప్రతి పార్టీకి ప్రత్యేకంగా ఒక న్యూస్ పేపర్, ఇంకా న్యూస్ ఛానల్ సొంతంగా ఉంటున్నాయి. లేదా కొన్ని పార్టీలకి ప్రత్యేకంగా మరికొన్ని న్యూస్ పేపర్లు లేదా న్యూస్ చానల్స్ తోడుగా ఉంటున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. ఇక సొంత పేపర్లు చానల్స్ ఉన్న వాళ్ళు ఎవరికి అనుకూలంగా వాళ్ళు వార్తలు చూపించుకుంటూ వస్తున్నారు.


పై వాళ్ళు చేసినవి కూడా వాళ్ళు చేసినట్లుగా, పక్క వాళ్ల క్రెడిట్ ని కూడా వాళ్ళ సొంత ప్రయత్నంలాగా చూపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ పార్టీలు కేంద్రం మీద వ్యతిరేకతతో వార్తలు చూపించుకుంటూ వస్తున్నాయని తెలుస్తుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి 25 వేల కోట్ల నిధులు కేంద్రం నుండి వచ్చాయని సాక్షి పత్రిక రాసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది 840 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి ఖర్చయినట్లుగా చెప్తున్నారు వాళ్లు.


అయితే చంద్రబాబు హయాంలో ఇలా అయిన ఖర్చు 10000కోట్లని చెబుతున్నారు. అంటే ఈ రెండు టర్మ్స్ లో కలిపి మొత్తంగా ఒక 30 వేల కోట్ల వరకు రహదారుల నిర్మాణానికి ఖర్చయినట్లుగా తెలుస్తుంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా అవి మోడీ జేబులోంచి ఖర్చు అవ్వవు. చంద్రబాబు జేబు నుండి ఇంకా జగన్ లేదా కేసిఆర్ జేబు నుండి కూడా ఖర్చు అవ్వవు. ఖర్చు అయ్యే ప్రతి పైసా ప్రభుత్వానిదే.


పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయి అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి రాబట్టుకున్నామని చెప్పేసి చెప్పుకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెడితే కేంద్ర ప్రభుత్వం ఓకే చేసి మంజూరు చేస్తుంది ఆ నిధులను. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని పనులు చేసినా కూడా అవన్నీ తాము చేయించుకుంటున్నామన్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP