దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన పెంచుతున్నాయి. అదే విధంగా కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో మరింత భయం పెరుగుతోంది. సకాలానికి ఆక్సిజన్ అందుబాటులో లేక ఎంతోమంది కరోనా రోగులు మరణిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ రోగుల సంఖ్య పెరగడంతో ఆక్సీజన్ సిలిండర్ల అవసరం ఎక్కువగా మారింది.