వేలాది మంది టీనేజి యువకులను ఇంటర్వ్యూ చేయగా ఈ విషయాలు బయటపడ్డాయని జాతీయ స్థాయి అధ్యయనం వెల్లడిస్తోంది. అమెరికాలోని టీనేజి కుర్రాళ్లు పాతిక మందిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎనిమిది మందిలో ఒకరు ఆ తలంపులో ఉంటున్నారు. ఈ సంఖ్య రానురాను పెరుగుతోందని, ప్రత్యేకంగా యవ్వనం దశ బలహీనతల కాలంగా పరిశోధకులు భావిస్తున్నారు. హార్వర్డు యూనివర్శిటీలో ఈ అధ్యయనం సాగించారు. అమెరికాలోని సుమారు 6500 మంది టీనేజి యువతను వ్యక్తిగతంగా ఇంటర్య్వూ చేశారు. ఎక్కువ ప్రమాదకరమైన దశ యవ్వనమని ఆత్మహత్య తలంపు ఆ దశలోనే ప్రారంభమవుతుందని పెద్దలు చెబుతున్నారని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పారు. యువకుల ఆత్మహత్య ఆలోచనలు ప్రయత్నాలు వ్యక్తిగతంగా తెలుసుకుని ఎవరు మానసికంగా గతి తప్పుతున్నారో అంచనా వేయగలిగారు. యువకుల్లో 12 శాతం మంది ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని, 4 శాతం మంది ఆత్మహత్య పథకం వేసుకున్నారని, మరో 4 శాతం మంది ప్రయత్నించారని పరిశోధకులు తమ అధ్యయనంలో వివరించారు. మద్యపానం లేదా మరేదైనామత్తు పదార్థాలకు లొంగిన వారు,మానసికంగా స్థిమితం లేనివారు ఇటువంటి దుస్థితికి బలవుతున్నారని వివరించారు. సగానికి సగం యువత ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటువంటి వాటిని ఎలా నివారించడమో తమకు తెలియడం లేదని ఈ ప్రవృత్తిని బాగు చేయగల వైద్య చికిత్స తమకు తెలియదని వారు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: