తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించిన టీ కాంగ్రెస్ ఎంపీలు... సీనియర్ నేత కేశవరావు ఇంట్లో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు అవసరమని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్షిండే ప్రకటించడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహంతో ఉన్నారు.
తెలంగాణ విషయంలో హైకమాండ్ పై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతోపాటు, పార్టీకి కూడా రాజీనామా చేసి సోనియాకు పంపనున్న లేఖలను టీ ఎంపీలు ఈ సమావేశం అనంతరం విడుదల చేయబోతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: