మన రాష్ర్టంలో వచ్చే మూడు రోజల పాటు పెళ్లి సందడి జరగనుందని చెప్పుకోవాలి. ఈ నెల 13,14,15 తేదీల్లో మన రాష్ర్టంలో భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు లక్షకు పైగా వివాహాలు జరుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా 14వ తేదీన మంచి ముహూర్తంగా పండితులు చెప్పతున్నారు. ఈ మూడు రోజుల తరువాత మళ్లీ మే నెల వరకూ వివాహలకు ముహార్తాలు లేకపోవడంతో 13,14,15 తేదీల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఈ మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో వివాహలు జరుగుతుండంతో పెళ్లి బృందాలకు, భజాభజంత్రీల బృందాలకు, పెళ్లి మండపాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో పురోహితుడు ఈ మూడు రోజుల్లో 5, 6 వివాహాలు చేసేందుకు ఒప్పుకున్నారంటేనే డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. ఇక కళ్యాణ మండపాలు దొరకడమే గగనంగా మారింది. ప్రధాన మండపాలన్నీ 3 నెలల క్రితమే రిజర్వు అయ్యాయి. తిరుపతి, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ 3 రోజుల పాటు మరింత హడావుడి నెలకొనబోతుంది. ఈ కళ్యాణాల ప్రభావం రవాణా సౌకర్యాలపై కూడా పడింది. ఈ మూడు రోజుల పాటు బస్సులు, రైళ్ళు కిటకిటలాడనున్నాయి. కాగా, ఈ నందన నామ సంవత్సరంలో ఇవే చివరి ముహుర్తాలు. ఈ నెలలో 13,14,15 తేదీల్లో మంచి ముహార్తాలు ఉన్నాయని పండితులు చెపుతున్నారు. ఈ నెల 17నుంచి మూఢం ప్రారంభం అయ్యి మే 2 వరకూ కొనసాగుతుందని, మూఢంలో శుభకార్యాలు ఏమీ చేసుకోరాదని, అందుకే 13,14,15 తేదీల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయని పండితులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: