హైదరాబాద్: బుధవారం రాత్రి ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డికి మద్దతుగా విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్నారు. ఏ తప్పు చేయని జగనన్నను తప్పులు కేసలు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన మాటలను విననందుకే రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని వీధిపాలు చేస్తుందన్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖర్ రెడ్డిని వారి మనస్సుల్లోంచి తొలగించేందుకు కాంగ్రెస్ కుట్రలకు,కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఎవరెన్ని వేధింపులకు గురి చేసినా జగనన్నను ఏమీ చేయలేరన్నారు. విజయమ్మ కూడా రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో అభ్యర్థి శోభానాగిరెడ్డి, వైఎస్ఆర్ నాయకుడు భూమానాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: