భారత సంచలన టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా చాలా కాలంగా ప్రారంభించాలనుకున్న 'రిస్ట్రెట్టో' రెస్టారెంట్ భూ వివాదంలో చిక్కుకుంది. దీంతో రెస్టారెంట్ వ్యాపారంలో ప్రవేశించాలన్న సానియా ఆశలకు మరికొంత కాలం బ్రేక్ పడినట్లైంది.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఏరియాలో కొందరు భాగస్వాములతో సానియా ఈ కాఫీ హౌస్ ను ప్రారంభిస్తోంది. అయితే రెస్టారెంట్ స్థలం లీజుకు తీసుకున్నది కావడంతో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.
ఇటీవలే ఆ స్థల యజమానికి హైకోర్టు భూమికి సంబంధించిన కేసులో అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే అతని ప్రత్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో, కోర్టు యథాతదా తీర్పును ఇవ్వడంతో మరోసారి సానియాకు చుక్కెదురైంది.
కోర్టు తీర్పు వచ్చే వరకు ఆమె తన రెస్టారెంట్ ను ప్రారంభించే అవకాశం లేదు. కాగా, ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు గట్టిగా పోరాడతామని సానియా బిజినెస్ భాగస్వామి శేషు రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: