హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ జంట బాంబుల కేసులో ఇప్పడు ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది. బాంబు పేలుళ్లకు రియాజ్ భత్కల్ కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. అతడే ఈ దారుణ ఘోరానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకీ రియాజ్ భత్కల్ ఎవరూ రియాజ్ బత్కల్ ఈ మారణ కాండలో ప్రత్యక్షంగా పాల్గోన్నాడా అసలు ఉగ్రవాదంవైపు రియాజ్ భక్తల్ ఎందుకు వెళ్లాడు. అన్నది ఆసక్తికరంగా మారింది.
రియాజ్ భత్కల్ పేరు చెబితేనే కర్నాటక జిల్లా మంగళూరు పోలీసులు భయపడుతున్నారు. రియాజ్ అసలు పేరు మహ్మద్ ఇస్మాయిల్. కర్నాటకలోని మంగళూరు జిల్లా భత్కల్ అనే మండల కేంద్రం అతడి స్వగ్రామం. రియాజ్ కు సొంతూరి పేరే ఇంటి పేరుగా మారిపోయింది. కేవలం పన్నెండో తరగతి వరకు చదువుకున్న రియాజ్ స్థానికంగా చిన్న చితక పనులు చేసేవాడు. ఆయనకు కొంత కాలం తరువాత నిషేదిత సిమి సంస్థతో పరిచయం ఎర్పడింది.
ఆతరువాత కొన్ని రోజుల పాటు ఆ సంస్థలోనే వివిధ హోదాల్లో పనిచేసాడు. అనంతరం సిమి సంస్థపై ప్రభుత్వం నిషేదంతోపాటు పోలీసుల చర్యలు పెరగిపోవడంతో కొన్ని రోజుల పాటు దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుండి పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ ఇండియన్ ముజాయిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందాడు. కొన్ని రోజుల పాటు ఇండియన్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలో పనిచేసిన రియాజ్ ఆ సంస్థలో వ్యూహ రచన విభాగంలో పినిచేసేవాడు.
భారతదేశంలో జరిగిన పేలులల్లో చాలా వరకు రియాజ్ ఆధ్వర్యంలో జరిగాయని యన్ ఐఎ పోలీసులు ప్రకటించారు. యన్ ఐఎ పోలీసులకు రియాజ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. భారత్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రణాళికలు రచించింది రియాజేనని నేషనల్ ఇన్వెస్ట్ గేషన్ ఏజెన్సీ పోలీసులు అనుమానిస్తున్నారు.
2010లో పుణెలో జరిగిన జర్మన్ బేకరీ పేలుళ్లు, 2011లో జరిగిన ముంబై పేలుళ్లలో రియాజ్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు యన్ఐఎ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మిగతా వారి గురించి కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కొందరి ఊహా చిత్రాలను కూడా రిలీజ్ చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: