దేశంలోని ముఖ్యపట్టణాల్లో అమయాకులను చంపడమే పనిగా పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులకు స్థానికంగా సహకారం ఎవరు అందిస్తున్నారనే విషయంలో ఇప్పుడిప్పుడే నిఘా విభాగాలు దృష్టి సారిస్తున్నాయి. స్థానికంగా సహకారం అందించకుండా ఉగ్రవాదులు ఇంతటి పని చేయడం సాధ్యం కాకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మతం, కులం, పేదరికం, మానవత్వం అనేది లేకుండా ప్రజలు రద్దీగా ఉండేచోట ఉగ్రవాదులు రెక్కీలు నిర్వహించి ప్లాన్ గా ప్రజలు ప్రాణాలు తీయడమంటే ఇందులో స్థానికంగా కొందరి సహకారం ఉంటుంది. కాగా దేశాన్ని నాశనం చేయడం, విచ్చిన్నం చేయడం, అమాయకులను చంపివేయడం వంటి సంఘటనలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడానికి, దేశంలోని కొంతమంది సహరించడానికి కారణాలేంటి అనే విషయాల్లో ప్రభుత్వాలు దృష్టి సారించాలి. జనాభా ఎక్కువగా ఉండేటువంటి నగరాల్లో ఎవరిని ఎవరు పట్టించుకోకుండా ఉండడంతో పాటు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన ఎవరికి అనుమానం రాకుండా ఉండడం కారణం ఒకటిగా ఉంటే, రెండవ కారణం ఉగ్రవాదులు ఏదో రూపంలో వచ్చి డబ్బుల ఆశజూపి నమ్మించి స్థానికంగా ఉండేటువంటి వారి వద్ద షెల్టర్ తీసుకోవడం జరుగుతుండడంతో ఉగ్రవాదులు తమ పనిని సులభంగా నిర్వహిస్తుండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించిన స్థానికంగా సహాయం ఎంతోకొంత లేనిది సాధ్యం కాదు. ఇటువంటి విషయంలో ఉగ్రవాదులు స్థానికంగా కొంతమంది సహాయం తీసుకోవడానికి కారణం అక్కడున్నటువంటి ప్రజల పేదరికం కారణమైనా ఉండాలి. లేదా స్థానికంగా సహాయం అందించిన వారు ఏదో రూపంలో ఉగ్రవాదులకు వ్యక్తిగతంగానైనా, లేదా మరేకారణంగానైనా సానుభూతిని కలిగి ఉండాలి. ఇటువంటి సందర్బంలోనే ఉగ్రవాదులు దారుణానికి పాల్పడడం సాధ్యపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: