పంద్రాగస్టు వచ్చిందంటే విద్యార్థుల్లో ఒక విధమైన సంబరం. తమకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆటలపొటీలు నిర్వహిస్తారని విద్యార్థులు మురిసి పోతుంటారు. కాగా మారుతున్న కాలంతో పాటు విద్యార్థులపై చదువు వత్తిడిపెంచడం , ఆర్థిక బారం మోయాల్సి వస్తుందనే కారణాలతో పాఠశాలల్లో ఆయా యాజమాన్యాలు విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించడం లేదు. ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఆవేదనకు గురవుతున్నారు. గతంలో జెండా పండుగకు 5 రోజుల ముందు నుండే విద్యార్థులకు వివిధ రకాల ఆటలను నిర్వహించేవారు. గెలుపొందిన విద్యార్థులైన విజేతలకు బహుమతులు అందించేవారు. ప్రస్థుతం ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ పాఠశాలల్లో సైతం క్రీడా పోటీలు నిర్వహించడం లేదు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికి వ్యాయామ ఉపాద్యాయలు లేరంటే ప్రభుత్వం క్రీడలపై ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో తెలుస్తుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని పలుమార్లు వివిధ సమావేశాల్లో హామిలిస్తున్నప్పటికిని చాలా పాఠశాలల్లో వ్యాయామ ఉపాద్యాయుల కొరత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి పోటీలను నిర్వహించక పోతే రాబోయే కాలంలో క్రీడలు ఇలా ఉండేవని తెలియ జెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: