హైదరాబాద్: కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న. ఏడు కొండలవాడి నామస్మరణాలతో మారుమోగాల్సిన తిరుపతి పరిసర ప్రాంతాలు చిన్నారి పిల్లల ఆర్తనాదాలతో మారుమోగుతోంది. తిరుపతిలో ఉన్న రుయా ఆస్పత్రి చిన్న పిల్లల మరణాలకు కేరాఫ్ గా మారింది. ఆక్సిజన్ అందక వారం రోజుల కిందటనే 11మంది చిన్నారులు చనిపోయారు. తాజాగా మరో ఐదుగురు చిన్నారులు చనిపోయారు. వైద్యుల అలసత్వమో, పాలకుల నిర్లక్ష్యమో తెలియదు కానీ, నెల రోజుల వ్యవధిలో ఈ చిన్న పిల్లల ఆస్పత్రి రుయాలో 30మంది వరకు చనిపోయారు. అయినప్పటికీ అటు వైద్యులు, ఇటు పాలకులకు ఏమాత్రం చీమకుట్టినట్లు కూడా లేదనీ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, సీపీఐ నాయకుడు నారాయణ సొంత జిల్లా చిత్తూరు. ఈ జిల్లాలోని తిరుపతిలో ఉన్న రుయా ఆస్పత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిండు నూరేళ్లు బతకాల్సిన చిన్నారులు సరైన వైద్యం అందక ఆకుల్లా రాలిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో 30మంది వరకు చిన్నారులు చనిపోయిన వైద్యులు, పాలకులు మొద్ర నిద్దను వీడటం లేదు. గురువారం నాడు ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి గల్లా అరుణ కుమారి కూడా ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవనీ అంగీకరించింది. వైద్యులు కూడా చికిత్సన అందించడానికి ఆసక్తిని చూపడం లేదంటున్న తీరుతోనే రుయాలో సమస్యలు ఎంతగా తిష్ట వేశాయో వేరే చెప్పనక్కర్లేదు.రుయా వసతులేమీతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆస్పత్రి కెపాసిటీ90పడుకలు.కానీ,ఇప్పుడు 200మందికి పైగా ఉన్నారు. దీనితో ఒకే బెడ్ పైన ఇద్దరుముగ్గుర్ని పడుకోబెట్టి వైద్యం నిర్వహిస్తుండటంతో ఒకరి నుంచి మరొకరికి ఇన్ ఫెక్షన్ సోకి అది మరణాలకు కూడా దారి తీస్తుంది. చిన్న ఆస్పత్రి నిర్వహాణకు ఏటా 60లక్షల రూపాయలకు గానూ సర్కార్ దానిలో సగం కూడా విడుదల చేయడం లేదనీ స్థానికులు ఆరోపిస్తున్నారు. వసతులేమీ, నిధులు లేక, వైద్యం అందక పోవడం మొత్తం కలిపి చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తల్లిదండ్రులకు కడుపుతకో మిగిలేది కాదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రుయాపై ప్రత్యేక ద్రుష్టిని మళ్లించాల్సిన అవసరం ఎంతయినా వుంది. లేదంటే మరి కొందరు తల్లిదండ్రులకు కడుపుకోత తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: