కాంగ్రేస్ ఆడిన మూడుముక్కలాటలో రాష్ట్రం మొత్తం ఓడిపోయింది. ఇక మిగిలిందల్లా నేతల పదవులే. అవి రేపోమాపో ఊడిపోనున్నాయి.ఎందుకంటే అంతో ఇంతో మిగిలినదంతా పోవాలంటే ఆటగాల్లు మారాలి. కాంగ్రేస్ పెద్దలు ఇప్పుడదే పనిలో ఉన్నారు.                 పరేల్(మూడు ముక్కలాట) ఆడితే పలితం అంతాసర్వనాశనం. ఇది ఆడిన వారు ఎవరు బాగుపడలేదు. మనరాష్ట్రపాలకు అదే గతి పట్టనుంది. అయితే నిజమైన ఆటలో సదరు వ్యక్తులు,వారి కుటుంబాలు వీధిపాలైతే కాంగ్రేస్ పాలకులాడిన ఆటలో రాష్ట్రం వీధిపాలుకావడం మన ధౌర్భాగ్యం.              రాజ్యాన్ని రాజు ఒక్కడే పాలించాలి.అంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏలాలి కాని మనరాష్ట్రానికి ముగ్గురు మొగుల్లు. ముఖ్యమంత్రి,పిసిసి అధ్యక్షులు,గవర్నర్...ఇక ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వీరిని నడిపించిన కాంగ్రేస్ అధిష్టానం కూడా రాష్ట్రంతో మూడుముక్కలాటే ఆడింది. రాష్ట్రభాద్యతలను పార్టీపరంగా మూడేళ్లలో ముగ్గురికి అప్పగించింది. వీరు తోచినంత దండుకుని రాష్ట్రాన్ని పిండుకున్నారే తప్ప ప్రజల,పార్టీ ప్రయోజనాలను చూడలేదు.వారే వీరప్పమొయిలీ,ఆజాద్,వాయలార్ రవి. మొత్తం మీద మనరాష్ట్రాన్ని ఆటలో పెట్టి ఇటు రాష్ట్రనేతలు,అటు కేంద్రనేతలు కుడిఎడమలా దగా చేశారు.                పలితం...అభివృద్దికి డబ్బులు లేవు, పంటలు పండించేందుకు,పరిశ్రమలు నడిపించేందుకు విద్యుత్ లేదు. సాగుభూములను కూడా లాక్కుని అప్పనంగా అమ్మేశారు.తినడానికి ఆహారధాన్యాల కొరత,తాగడానికి నీటికొరత,రోగం వస్తే మందులకొరత ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంత నష్టం జరగాలో అంతకంటే ఎక్కువ జరిగింది.              రాష్ట్రం ఇప్పుడు బజారున పడింది. బతకాడినికి అడుక్కుందామన్న ఇచ్చేవారు కనిపించడంలేదు. చివరకు మనతో మూడుముక్కలాడి దోచుకున్న కేంద్రాన్ని బిచ్చమడిగినా లేదు పొమ్మంటోంది. ఇంకా దోచుకోవడానికి ఏమో ఉందన్న అనుమానం.ఇప్పుడు ఆడిన రాష్ట్రప్లేయర్లు ఏమో దాచారని సందేహం...అందుకే దానిని కూడా దోచుకునేందుకు ఆటగాళ్లను మార్చే పనిలో పడ్డారు. ఇంకా ఏముంది ప్రజలప్రాణాలు తప్ప.అవి కూడా ఇవ్వడం మొదలయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: