హైదరాబాద్: శనివారం నాడు మాలలు రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న మాలలు టీడీపీ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రయత్నించారు. మాలలకు టీడీపీ వ్యతిరేకంగా ఉందంటూ మాల ప్రతినిధులు ఆరోపించారు. టీడీపీ కార్యాలయాల ఎదుట బైఠాయించారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. కార్యాలయాల్లోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యాలయాల్లోకి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ మాల ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: