హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గురించి మరోసారి పుకార్లు ఊపందుకున్నాయి. ఇది వరకే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరబోతున్నాడనే వార్తలు వచ్చాయి. జగన్ విడుదల తర్వాత అవి మరింత ఊపందుకున్నాయి. ఇక నార్నే శ్రీనివాసరావు జగన్ వైపు చేరడం లాంఛనమేనని విశ్లేషకులు అంటున్నారు. దీనికి అనేక రుజువులను చూపుతున్నారు.
ప్రత్యేకించి జగన్ విడుదల రోజునా నార్నే శ్రీనివాసరావు కు చెందిన టీవీ చానల్ చాలా హడావుడి చేసింది. జగన్ సొంత చానల్ తో సమానమైన స్థాయిలో కవరేజ్ ఇచ్చింది ఆ టీవీ చానల్. జగన్ కు అనుకూలంగా ప్రత్యేకమైన విశ్లేషణలు ప్రసారం చేసింది. సీబీఐ కొండను తవ్వి ఎలుకను పట్టిందని అభిప్రాయపడింది. ఓవరాల్ గా జగన్ పై ఆస్తుల కేసు కేవలం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల కుట్ర అని అభిప్రాయపడింది ఆ చానల్. దీన్ని బట్టి.. ఏదో జరగబోతోం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జగన్ కూడా నార్నేని పార్టీలో చేర్చుకోవడం గురించి ఆసక్తితో ఉన్నాడని సమాచారం. ఎన్టీఆర్ మామ అవ్వడం తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన వాడు అయినందువల్ల నార్నేలో జగన్ ప్రత్యేక ఆసక్తి చూపడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. అతి త్వరలో ఎన్టీఆర్్ కు పిల్లనిచ్చిన మామ జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి