ఏపి రాజకీయాలు ఈవారం వాతావరణాన్ని వేడెక్కించాయి. కరెంటు కోతలపై విపక్షాల ఆందోలనలతో మొదలైన రాజకీయాలు ఢిల్లీలో జరిగిన కాంగ్రేస్ కుర్చీలాటలతో ముగిసాయి. మొత్తం మీద రాజకీయాలు విపక్షాల్లో ఊపునివ్వగా,కాంగ్రేస్ ను కంపుకంపు చేసాయి. మొదట మంత్రి ధర్మాణ రాజీనామా వ్యవహారం కాంగ్రేస్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే విపక్షాలు అంతగా పట్టించుకోకపోయినా మంత్రికి బాసటగా పిసిసి ఛీఫ్ బొత్సతో సహా 22మంది మంత్రులు నిలవడంతో కాంగ్రేస్ పార్టీని కలవరపరచింది. చంద్రబాబు బిసిల డిక్లరేషన్ పై స్పందించి చంద్రబాబుకు వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాసిన లేఖ రాష్ట్రరాజకీయాల్లో సంచలనం సృష్టించింది. దీంతో ఇటు వైకాపాతో సహా పార్టీలన్నీ కులరాజకీయాలకు తెరలేపాయి. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఆయన మెడకే చుట్టుకుంది. మాలలంతా టీడిపి కార్యాలయాలను ముట్టడించడంతో టిడిపి ఉక్కిరిబిక్కిరయింది. విద్యుత్ కోతలపై విపక్షాలన్నీ ఆందోలన బాటపట్టాయి.విద్యుత్ సౌద,విద్యుత్ కార్యాలయాల ముట్టడులు,ధర్నాలతో టిడిపి,టిఆర్ఎస్ లు రాష్ట్రపరిస్థితులను ప్రభావితం చేసాయి.ఆఇరుపార్టీల నేతల అరెస్టులు,టిఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేసు, ఈసంధర్బంగా ఇలా అయితే గన్ మెన్ లను ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుందని పోలీస్ బాస్ చేసిన వాఖ్యలు వివాదస్పదమయ్యాయి. తెలంగాణ వాదాన్ని ఒంటరిగా భుజాన వేసుకుని సిపిఐ పోరుయాత్ర,టీజెఏసిలో కలువమని ఆపార్టీప్రకటించడం టీఆర్ఎస్,టీజేఏసికి కొంత ఇబ్బందిని సృష్టించింది.సందెట్లో సడేమియాలా కాంగ్రేస్ టీఎంపీలు కూడా తెలంగాణ కోసం అంటూ సమావేశం, సొంత పార్టీపైనే ఘాటు వాఖ్యలు షరామామూలుగా జరిగిపోయాయి. ఇక ఈవారం అంతా రాజకీయాల సంచలనాలు, వేడిని రగిలించాయి. ధర్మాన వ్యవహారం చిలికిచిలికి గాలివానాల మారి ఢిల్లీచేరింది. విసిగిపోయిన అధిష్టానం సమూలమార్పులే చేస్తామంటు రాష్ట్ర అగ్రనేతలందరిని ఢిల్లీకి పిలిపించుకును నానా హడావిడి చేసింది.మూడురోజులపాటు చిరంజీవి, బొత్స, సిఎంలతో సహా పలు ప్రాంతాల నేతలతో పార్టీ అగ్రనేతలు,సోనియాతో సహా సమావేశాలు పెట్టి ఏనిముషానికి ఏంజరుగుతుందో నన్న ఉత్కంఠను అటు పార్టీలోను,ఇటు రాష్ట్రప్రజల్లోను టెన్షన్ తో కూడిన ఉత్కంటను పుట్టించింది. సిఎం,పిసిసిచీఫ్ మారుతారని,ధర్మానతో సహా ఆరోపణలెదుర్కుంటున్న మంత్రులందరికి ఉద్వాసన ఉంటుందని, కాదు ఇప్పుడు ఒక బొత్స,ధర్మాణ ఉద్వాసనతోనే సరిపెడతారని, వీటితో పాటు ఏర్పడనున్న ఖాలీల్లో భర్తీకాబోయే నాయకులపేర్ల ఊహాగానాలతో అటు పార్టీ, ఇటు మీడియా, మరోవైపు ప్రజలను నాలుగురోజులపాటు తెగ బిజీచేసింది. కాని కాంగ్రేస్ అధిష్టానం మాత్రం ఎప్పటిలాగే కూల్ గా తనమార్కును ప్రదర్శించింది. ఏమి చేయకుండానే ఉన్నదానిని ఉన్నట్లుగానే ఉంచి అందరిని ఫూల్స్ చేసింది.  మాలల ఆందోళన : http://bit.ly/OeGYPQ  రావణకాష్టం ఆగాలంటే....తెలంగాణ ఇవ్వాలి : http://bit.ly/Want-Telangana వెళ్లారు... కలిశారు... వచ్చారు.. : http://bit.ly/ROpkrp ఛీ...ఛీ... అనేవారు ఇంకెవరైనా మిగిలారా..? : http://bit.ly/MTt2No కుర్చీలపై ముగిసిన కసరత్తు – ఇక మొదలవుతాయా కుంపట్లు : http://bit.ly/MTt2No ప్రజలు – అధిష్టానం : http://bit.ly/NuoCbu   స్తినలో హై టెన్షన్ : http://bit.ly/ROqp2A సీపీఐ ప్రజా పోరుయాత్ర -టీఆర్ఎస్ మీటింగ్ వాయిదా : http://bit.ly/RclWju బొత్సతో బోణి? : http://bit.ly/PGbVyD చావుబతుకులిక్కడ – చచ్చు రాజకీయాలక్కడ : http://bit.ly/OeO0nO  కాంగ్రెస్ కొంపముంచనున్న కరంటు : http://bit.ly/PRwLe6

మరింత సమాచారం తెలుసుకోండి: