కొన్ని విషయాల్లో మన నేతల తీరు సూపర్ స్టోరీయే. ఎందుకంటే వారు ఒకే సమస్యపై స్పందిస్తున్న తీరు మననేతలు చెప్పేవన్నీ కహానీలేనని కేవలం ఏదో చేస్తున్నాం,ప్రజలకేదో ఒరగపపెడుతున్నాం అని కొడుతున్న ఫోజులేననిపిస్తాయి.        ప్రస్తుతం మనరాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య విద్యుత్ అన్నది అందరికి తెలిసిందే. దీనిపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు, అధికారపక్షం తీరేంటో పరిశీలిద్దాం. విద్యుత్ కోతలు ఎత్తివేయాలని, సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వాలని గోడలెక్కి,రాత్రిపగలు తేడాలేకుండా నానా యాగి చేస్తోంది తెలుగుదేశం. మరో వైపు సిపిఐ విద్యుత్ సర్ చార్జీలు ఎత్తివేయాలని ఆందోలన చేస్తోంది. అంటే పెరుగుతున్న విద్యుత్ చార్జీల గోల టిడీపికి, ఇబ్బంది పెడుతున్న కోతల గూర్చి సిపిఐ కి అక్కర్లేదన్నమాట.         అలాకాక ఎదుటివారు లేవనెత్తిన దానిని మేము భుజాన వేసుకుంటే పరువు పోతుందనో,లేక దానివల్ల వచ్చే క్రెడిట్ ను పంచుకోవాల్సి వస్తుందనో ఆఇరు పార్టీలు ఒకే సమస్యపై రెండు విభిన్న కోణాల్లో ముందుకు వెలుతున్నాయనుకుందాం. మరి అధికారపార్టీ ఈరెండు పార్టీలకు ధీటైన సమాధానం ఇవ్వాలిగా. అంటే కోతలపై హామి,సర్ చార్జీల తగ్గింపు చేస్తామనో,లేక పరిశీలిస్తామనో చెబితే వాటి డిమాండ్లకు తలొగ్గినట్టే కదా అనుకుందేమో. ఈరెండు సమస్యల పరిష్కారానికి మన ముఖ్యమంత్రి గమ్మత్తైన రీతిలో సమాధానమిచ్చారు.          అదేంటంటే విద్యుత్ ను పొదుపు చేయాలట. అంతే కాదు దానికి చిట్కాలు కూడా చెప్పేస్తున్నారు. కోత తీరేది కాదని గణాంకాలతో సహా తెగ ప్రసంగాలు,హితబోధలు చేసేస్తున్నారు. పొదుపుతో కోత,చార్జీలమోత రెండూ తగ్గుతాయిగా. అయినా కరెంటు పోతే ఎలా ఉంటుందో తెలియని వారికి సామాన్యప్రజలు పడుతున్న విద్యుత్ బాధలు జోక్ లాగే ఉంటాయనడానికి ఇంతకంటే ఇంకా ఉదహరణలేం కావాలి చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: