జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ సమైక్య శంఖారావ సభకు రావడానికి జనం ఫిక్స్ చేసిన రేటు ఇదేనని సీమాంద్ర జిల్లాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానికి వారి ప్రాంతాల్లో నిర్వహించే ఏ లీడర్ సభకైనా సాధారణంగా తీసుకునేంది రూ.300లే నట. కాని హైదరాబాద్ దూరం కావడం, వచ్చి పోవడానికి రెండు రోజుల సమయం పడుతుందడంతో వారు రెండురోజుల కూలి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి.

జగన్ సభకు జన సమీకరణే అత్యంత ప్రాధాన్యమైనదన్న విషయం అందరికి తెలిసిందే. దీని కోసం 13 జిల్లాల్లో అన్ని నియోజక వర్గ ఇంచార్జీలకు, రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారికి జన సమీకరణపై టార్గెట్ పెట్టిందట పార్టీ నాయకత్వం. ఈ మేరకు ఏ నియోజక వర్గం నుంచి ఎంత మందిని తేవాలో ఇటీవలే జగన్ పార్టీ జిల్లా ఇంచార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఫిక్స్ చేసారంటున్నారు.

దీంతో వారంతా ఇప్పటి నుంచే రైళ్లు, బస్సులు, ఇతరత్ర వాహనాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇక సభకు వచ్చే జనాన్ని బుక్ చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీ కార్యకర్తలు, ద్వీతీయ శ్రేణి నాయకులు మాత్రం స్వచ్చందంగానే వస్తున్నారట, కాని వారికి రానుపోను ఖర్చులు, మందు, విందు మాత్రం నియోజక వర్గాల ఇంచార్జీలే భరించాలని తెగేసి చెబుతున్నారట. ఇక సాధారణ జనానికి మాత్రం ఒక్కొక్కరికి రూ.500 ల చొప్పున ఇంట్లో ముందుగానే ఇచ్చి తీసుకుపోవాలి, తీసుకుపోయినప్పటి నుంచి వచ్చే వరకు ఖర్చులు అదనంగా భరించాలట. ఇందులో నిజముందో లేదో తెలియదు కాని సీమాంద్ర ప్రాంతంలో ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: