జగన్మోహన్ రెడ్డి మూడు
నెలల్లో చేయగలిగిన పనిని చంద్రబాబునాయుడు 14 ఏళ్ళలో ఎందుకు చేయలేకపోయారు ? ఇపుడిదే
ప్రశ్న ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను పట్టి పీడిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో
విలీనం చేయాలన్నది ఉద్యోగులు, కార్మికుల దశాబ్దాల డిమాండ్. కానీ ఏ ముఖ్యమంత్రి
కూడా ఈ పని చేయలేకపోయారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని పనిని జగన్ మూడు నెలల్లోనే ఎలా చేయగలిగారు ? పైగా ఇందులో న్యాయ పరమైన సమస్యలు కూడా ఏమీ లేవనే అనిపిస్తోంది. మరి ఏ సమస్యా లేనపుడు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎందుకు ప్రయత్నించలేదో అర్ధం కావటం లేదు.
2014 ఎన్నికల్లో కూడా ఆర్టీసి ఉద్యోగులు, కార్మికులు చంద్రబాబును అడిగారు. అదే సమయంలో జగన్ ముందు కూడా తమ డిమాండ్ ను ఉంచారు. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టంచుకోకపోయేసరికి వాళ్ళు కూడా వదిలేశారు. విలీనానికి న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం చూపించేది.
అయితే అధికారంలో వస్తే ఆర్టీసి విలీనం చేస్తానని జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు 2019లో. అనుకున్నట్లే అధికారంలోకి రాగానే విలీన ప్రక్రియ కోసం ఏ నిపుణుల కమిటిని నియమించారు. ఆర్టీసిని విలీనం చేయటానికి న్యాయపరమైన సమస్యలున్నట్లు కమిటి చెప్పింది. దాంతో రెండో మాటకు తావులేకుండా సంస్ధ విలీనాన్ని వదిలిపెట్టేసి కేవలం ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసేసుకున్నారు జగన్.
దశాబ్దాల డిమాండ్ ను జగన్ ఇంత సింపుల్ గా పరిష్కరించేసరికి ఉద్యోగులు,కార్మికులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంత సింపుల్ గా పరిష్కరించగలిగిన సమస్యను చంద్రబాబు ఎందుకు పరిష్కరించలేకపోయారు ? ఎందుకంటే సమస్యలను పరిష్కరించటం చంద్రబాబు డిక్షనరీలోనే లేదు కాబట్టే అని ఉద్యోగులే అనుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి