ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సమయంలో... ఆర్టీసీలోని 5, 100 రూట్లను  ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేబినెట్ తో సమీక్ష  అనంతరం  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై సవాల్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆర్టీసీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ పై  నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదించిన అడిషనల్ జనరల్... తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసిందంటూ తెలిపారు. అంతేకాకుండా సెక్షన్  67 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ  సంస్థపై పూర్తి అధికారాలు ఉంటాయంటూ అడిషనల్ జనరల్  వాదించారు. ఈ పాలసీ పై పిటిషన్ దారుడు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేపట్టినట్లు తెలిపారు. 

 

 

 అడిషనల్ జనరల్ వాదనకు ఏకీభవించింది హైకోర్టు.ఆర్టీసీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు.  ఆర్టీసీలోని 5, 100 రూట్లను  ప్రైవేటీకరించడాన్ని  సమర్థిస్తూ తీర్పును వెలువరించింది. 5,100 రూపాయలు ప్రైవేటీకరణకై  క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేం అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. అయితే ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో... ఆర్టీసీ కార్మికుల భవితవ్యంపై నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. అయితే తమను  ఎలాంటి షరతులు లేకుండా వీధుల్లో చేర్చుకోవాలని సమ్మెను  విరమిస్తానని ఆర్టీసీ జేఏసి  ప్రకటించడంతో దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని అటు ఆర్టీసీ కార్మికుల్లోనే కాదు తెలంగాణ ప్రజానీకంలో  కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.కాగా గురువారం  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ నిర్వహించడం ప్రభుత్వం వల్ల కాదని ఆర్టీసీకి నిర్వహించేందుకు... శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

 

 

 

అయితే ప్రస్తుతం ఆర్టీసీ ని యథాతదంగా  కొనసాగిస్తే 640 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే ఆర్టీసీ సంస్థపై ఐదువేల కోట్ల ఆస్తులు ఉన్నాయని తక్షణమే చెల్లించాల్సిన అప్పులు రెండు వేల కోట్లు ఉన్నాయని... ప్రతినెల ఇంత భారీ మొత్తాన్ని ఆర్టీసీపై వెచ్చించటం  సాధ్యపడదు అని తెలిపారు. అటు ఆర్టీసీ కార్మికులు కూడా తమ ప్రకటనపై ప్రభుత్వం స్పందించకపోతే సేవ్ ఆర్టీసీ పేరుతో సమ్మె ఉధృతం చేస్తామని రేపటి నుంచి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మె మరింత ఉధృతం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: