ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుండి పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై ఫోకస్ చేశారు. 
 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించింది. పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి అనుకూలంగా రాకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉన్నారు. 
 
సేవ్ నల్లమల, ఇసుక కొరత మొదలైన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించటంతో ప్రజల దృష్టి కూడా పవన్ కళ్యాణ్ పై పడింది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో మరలా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు నిర్మాతలు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. 
 
కానీ రాజకీయ విశ్లేషకులు జనసేన పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తున్న సమయంలో పవన్ సినిమాల్లోకి వెళ్లడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే అభిమానులు పవన్ కళ్యాణ్ ను తప్పక ఆదరిస్తారని కానీ పవన్ సినిమాల్లో నటిస్తూ పోతే రాజకీయాల్లో రాణించటం కష్టం అవుంతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లోకి వెళ్లి పవన్ మరొక తప్పు చేయవద్దని రాజకీయ విశ్లేషకులు సూచనలిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: