దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ దారుణ హత్య కేసులో దిశపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎస్ పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి నిజామాబాద్ కు చెందిన శ్రీరామ్ అని గుర్తించారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సోషల్ మీడియాలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి శ్రీరామ్ ను అరెస్ట్ చేశారు. బాధితురాలి పేరుతో సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో నిందితులు ప్రచారం చేశారు. ఫేస్ బుక్ లో ఒక గ్రూపుగా ఏర్పడి నిందితులు ఈ రకమైన ప్రచారం చేశారు. అనుచిత వ్యాఖ్యలపై చాలామంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేయడం వలనే శ్రీరామ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. 
 
నలుగురైదుగురు కామెంట్లు చేస్తున్నట్లు తెలిసిందని మిగిలిన వారి మీద చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించి చేసే కామెంట్లపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది. శ్రీరామ్ ఫేస్ బుక్ లో రేప్ చేస్తే తప్పేంటి అని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 
 
నిందితుడు శ్రీరామ్ నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ కు చెందినవాడు.సోషల్ మీడియా వేదికగా కొందరు దిశ ఘటనపై అనుచిత పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. పోలీసులకు ఈ పోస్టులపై కొందరి నుండి ఫిర్యాదులు అందాయి. పోలీసులు రంగంలోకి దిగి కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. దిశ హత్య కేసులో నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. దేశవ్యాప్తంగా దిశ హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష విధించాలని ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కేసులో నిందితులకు మరణ శిక్ష విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: