చాలా మంది ప్రయాణికులు రైళ్లలో జనరల్ బోగీలలో ప్రయాణం చేస్తూ ఉంటారు. జనరల్ బోగీల్లో సీట్లు దొరకడం అంత తేలిక కాదు. కానీ ఇబ్బందులు ఉన్నా, సీట్లు దొరక్కపోయినా గమ్యస్థానాలకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ చేరుకుంటారు. రైల్వే శాఖ జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుండి జనరల్ బోగీల్లో కూడా రిజర్వేషన్ సీట్లను పొందే సదుపాయం రైల్వే శాఖ కల్పిస్తోంది. 
 
ప్రస్తుతం ప్రయాణికులు ఎవరైతే జనరల్ బోగీల్లో సీట్లు పొందాలనుకుంటారో వాళ్లు రైలు మొదలయ్యే స్టేషన్ కు గంట ముందు చేరుకుంటూ ఉంటారు. కానీ రైల్వే శాఖ ప్రవేశపెడుతున్న కొత్త విధానం ద్వారా జనరల్ టికెట్లు తీసుకునే వారికి కూడా రైళ్లలో సీట్లు కన్ఫర్మ్ అవుతాయి. రైల్వే కౌంటర్లలో ప్రయాణికుడు తన ఐడీ కార్డును ఇచ్చి జనరల్ బోగీల్లో రిజర్వేషన్ సీట్లను పొందవచ్చు. 
 
రైల్వే కౌంటర్లలో ప్రయాణికుడు ఇచ్చిన ఐడీ కార్డును సిబ్బంది ఫోటో తీస్తారు. ప్రయాణికుడి వాట్సాప్ నంబర్ కు డిజిటల్ టికెట్ ను సిబ్బంది పంపుతారు. జనరల్ కంపార్ట్మెంట్లలో కేటాయించిన సీట్లలో కూర్చొని ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా దానాపూర్ డివిజన్ లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. పాస్ ఫర్ అన్‌రివార్డెడ్ బోర్డ్( పియుఆర్‌బి) అనే పేరుతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది. 
 
రైల్వే శాఖ కొన్ని నెలల తరువాత దేశమంతటా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉందని సమాచారం. ఈ విధానం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు రైళ్లలో జనరల్ బోగీల్లో కూడా ప్రశాంతంగా ప్రయాణం చేసే వీలు ఉంటుంది. తరచుగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ విధానాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకొనిరావాలని కోరుతున్నారు. రైల్వే శాఖ దానాపూర్ డివిజన్ లో చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మొదట నగరాల్లో ఆ తరువాత పట్టణాల్లో జనరల్ టికెట్ల ద్వారా రిజర్వేషన్ సీట్లను పొందే సదుపాయాన్ని కల్పించబోతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: