రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపిస్టుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ అవసరం లేదని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. క్షమాభిక్ష పిటిషన్లపై రివ్యూ జరగాలని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యాచారాలకు ఒడిగడుతున్న మానవ మృగాలపై దయ చూపించాల్సిన అవసరం లేదని రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అత్యాచారాలకు పాల్పడేవారు క్షమాభిక్షకు అనర్హులని వారికి క్షమాభిక్ష ప్రసాదించబోమని స్పష్టం చేశారు.
 
దేశంలో క్షమాభిక్ష పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే రాష్ట్రపతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ పోలీసులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయపరంగా మాత్రం పోలీసుల ఎన్ కౌంటర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ ఎన్ కౌంటర్ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఈ వివరాలను పంపించనున్నట్లు తెలుస్తోంది. 
 
సినీ నటుడు పవన్ కళ్యాణ్ అత్యాచారాల విషయంలో మరింత కఠిన చట్టాలు అమలులోకి తీసుకొనిరావాలని ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలని అన్నారు. మేధావులు కఠిన చట్టాలు తయారు చేయటం కోసం ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దిశ ఆత్మకు శాంతి కలగాలని దిశ తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 
 
కొందరు రాజకీయ నేతలు మాత్రం నిందితులకు చట్టపరంగా శిక్ష పడితే బాగుండేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ గురించి తెలియగానే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అదే సమయంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ నిందితులకు మరణ శిక్షే మేం కోరుకున్నామని అది న్యాయపరంగా జరిగితే బాగుండేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: