టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అత్యాచార బాధితులకు వెంటనే న్యాయం జరిగే విధంగా న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. వరంగల్ లో జరిగిన యువతి అత్యాచారం, హత్య ఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. షాద్ నగర్ లో దిశ, వరంగల్ లో యువతి అత్యాచార ఘటనల వలన మహిళలకు భద్రత కరువవుతోందని అనిపిస్తోందని కోదండరాం అన్నారు. 
 
మహిళల రక్షణపై విసృతమైన చర్చలు జరిగాలని, మహిళల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని అన్నారు. మహిళలకు భద్రత కరువైందనే భావన రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోందని అన్నారు. ఈ ఘటనల వలన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆ ఆందోళనలు రాష్ట్రానికే పరిమితం కాలేదని అన్నారు. 
 
దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలపై పెద్దఎత్తున ఆందోళన చెలరేగిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలనేదే కీలకమైన ప్రశ్న అని అన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు వెంటనే కఠినమైన శిక్ష వేయాలని చెప్పారు. బాధితులకు న్యాయం జరగాలనే మనం అంతా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆ మేరకు దిశ ఘటనలో ఎన్ కౌంటర్ జరిగి నలుగురు నిందితులు చనిపోయారని అన్నారు. 
 
న్యాయవ్యవస్థ సరిగా లేకపోవటం, సరైన సమయానికి న్యాయం అందించే పరిస్థితి లేకపోవటం, వెంటవెంటనే న్యాయం అందించటానికి అందరూ పూనుకోకపోవటం మొదలైన కారణాల వలన ఇలాంటి ఘటనల్లో శిక్ష ఆలస్యమవుతుందని అన్నారు. చట్టాల్లో మార్పులు తీసుకొనిరావాల్సి ఉందని కోదండరాం అన్నారు. వరంగల్ లో అత్యాచారానికి గురై మరణించిన బాధితురాలి తల్లి మాట్లాడుతూ దిశ ఘటనలో న్యాయం జరిగిందని తన కూతురికి  కూడా న్యాయం జరగాలని అన్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచార ఘటనలపై అన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: