2012లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. నిర్భయపై  అత్యాచారం చేసి చంపడంతో యావద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే నిర్భయ ఘటనలో నిందితులను దారుణంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. కానీ ఘటన జరిగి సంవత్సరాలు గడిచి పోతుంది అప్పటికి కూడా  నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడలేదు. నిర్భయపై 2012 డిసెంబర్ 16వ తేదీన అత్యాచార ఘటన జరిగింది. కాగా  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. 

 


 ఇక ఇన్నేళ్ళకి నిర్భయ ఘటనలో  నలుగురు నిందితులకు  శిక్ష పడింది . నిర్భయ ఘటన నిందితుల కు ఉరిశిక్ష విధించాలని కేంద్రం ఆదేశాల జారీచేసింది . కాగా డిసెంబర్ 16న ఈ కేసులో నలుగురు నిందితులకు ఉరి తీయనున్నారు. ఈ నెల 16న ఉదయం 5 గంటల సమయంలో దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు  అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్భయ కేసులో నిందితులు తీహార్ జైలులోనే ఉండగా వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మొత్తంగా  నిర్భయ ఘటనలో ఆరుగురు నిందితులు ఉండగా... వీరిలో ఒకరు జువైనల్ కోర్టు విధించిన శిక్ష అనుభవించారు.  మరో నిందితుడు జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 


 ఇక మిగిలిన నలుగురు నిందితులకు కేంద్రం ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా  నిర్భయ పై అత్యాచారం జరిగిన డిసెంబర్ 16 రోజునే  నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఉరితీయబోతుండటం గమనార్హం . అయితే నిర్భయ కేసులో ఇప్పటివరకు నిందితులకు శిక్ష విధించకుండా ఆలస్యం చేయడం పై నిరసనలు వెల్లువెత్తిన  విషయం తెలిసిందే. కాగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వైద్యురాలు దిశగా ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత నిర్భయ కేసు గురించి దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: