హైదరాబాద్ షాద్నగర్ వైద్యురాలు దిశ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు అతి దారుణంగా దిశ అనే వైద్యురాలని హత్యాచారం చేసి హత్య చేసి అనంతరం పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు ఉరిశిక్ష వెంటనే అమలు  చేయాలంటూ దేశం మొత్తం నిరసన వ్యక్తం కాగా... పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు. అయితే దిశా  ఘటన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ప్రత్యేక కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలు చిన్నారుల భద్రత కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 

 

 

 

 హైదరాబాద్ షాద్నగర్ లో  అత్యాచారం హత్యకు గురైన మృతురాలు దిశ పేరుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ సర్కార్ .  దిశ చట్టానికి సంబంధించిన బిల్లును జగన్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా దిశా  చట్టానికి ఆమోదం తెలిపింది. అయితే మహిళలు చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టానికి సంబంధించిన బిల్లుకు అసెంబ్లీలో  ఆమోదం తెలిపిన టిడిపి... చట్టాలను ప్రవేశపెట్టడమే కాదు అమలు చేయడంలో కూడా అంతే శ్రద్ధ చూపించాలని తెలిపారు. అయితే దిశ చట్టానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన రోజే గుంటూరులో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే ఈ అత్యాచారంపై టిడిపి నేతలు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని విమర్శలు గుప్పించారు. 

 

 

 

 దీనిపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. నేడు అసెంబ్లీలో మాట్లాడిన ఆమె.. దిశా  చట్టం ఇంకా అమలు చేయలేదని కానీ టిడిపి సభ్యులు ఈ లోపే... రాద్ధాంతం చేస్తూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం తాము ప్రవేశపెట్టిన దిశా  చట్టాన్ని అమలు చేయక ముందే అందులో లోపాలు ఉన్నాయని టిడిపి ఆరోపించడం సరికాదని... టిడిపి సభ్యులు అందరూ తమపై బురద చల్లేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు చిన్నారుల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వంకి ఉన్న  చిత్తశుద్ధిని శంకించలేరని  ఆమె పునరుద్ఘాటించారు. మహిళలపై నేరాలకు కేసులు నమోదు చేయడం లేదని టిడిపి తప్పుడు ప్రచారం చేస్తూ ఈ విషయంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: