ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని విషయంలో అటు ప్రజలు ఇటు నేతల్లో అయోమయం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రాజధాని మార్పు రగులుతూనే ఉంది. ఇక తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ర రాజధానిలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలతో.. రాజధాని వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి.
అటు అమరావతి రైతులు కూడా జగన్ 3 రాజధానిల నిర్ణయంపై భగ్గుమన్నారు. అమరావతి కోసం తాము పంట పండించే భూములకు త్యాగం చేస్తే ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని మార్పు చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటన చేయడం దారుణమని వెంటనే తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఆందోళనలు తెలుపుతున్నారు అమరావతి రైతులు. దీంతో అమరావతి లో అంతా హాట్ హాట్ గా మారింది. ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిలో నిర్ణయంపై మాజీ ఎంపీ చింతా మోహన్ కొత్త బాణి వినిపించారు.
తిరుపతి ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ చింతా మోహన్. తాజాగా చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే నాలుగు పర్యాయాలు మారిన రాజధాని ఐదోసారి మారడం తథ్యం అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం డిల్లీలో అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతోందని... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అమిత్ షా గుప్పిట్లో ఉన్నారు అని వ్యాఖ్యానించారు ఆయన. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుపతి నగరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన రాజధాని.. 1953లోనే తిరుపతి ని రాజధానిగా చేయాలని అనుకున్నారు అంటూ మాజీ ఎంపీ చింతామోహన్ వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి