నిన్న  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో ముందు అందరూ ఊహించినట్టుగానే టిఆర్ఎస్ పార్టీ జోరు చూపించండి.అన్ని  ఎన్నికల్లో లాగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది టిఆర్ఎస్ పార్టీ. వందకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. టిఆర్ఎస్ పార్టీ జోరుకు ఏ పార్టీ కూడా ఎదురు నిలువలేకపోయింది. అయితే పలుచోట్ల ఇండిపెండెంట్లు హవా  నడిపించినప్పటికీ ఎక్కువ మొత్తంలో మాత్రం కారు పార్టీ 100 స్పీడ్ తో  దూసుకుపోయి  100 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 

 

 

 అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఎంతమేరకు ఓటర్లని  ఆకట్టుకున్నారు అని తేలిపోయింది. ఇక కొంతమంది స్వల్ప తేడాతోనే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. స్వల్ప  తేడాతో ఓటమి పాలవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు అభ్యర్థులు. అయితే మున్సిపల్ పోలింగ్ సమయంలో అక్కడక్కడా రసాభాస జరిగినప్పటికీ ఎన్నికల కౌంటింగ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. అయితే మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఒక స్కేలు ఒక అభ్యర్థికి విజయాన్ని వరించేలా చేసింది. 

 

 

 ఆ స్కేల్ వల్లే అభ్యర్థి విజయం సాధించాడు అనడంలో సందేహం లేదు. స్కేల్  కారణంగా విజయం సాధించడం ఏంటి అంటారా.. అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని కొంపల్లి మున్సిపాలిటీలో కౌంటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఈ సంఘటన చోటు చేసుకుంది. మూడో వార్డులో  ఓట్ల కౌంటింగ్ లో మొదటి నుంచి బిజెపి టిఆర్ఎస్ పార్టీలు సమంగా కొనసాగుతూ వచ్చి చివరికి ఈ రెండు పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే ఈ కౌంటింగ్ లో ఒక ఓటు మాత్రం ఇరు పార్టీల గుర్తులకు  మధ్యలో ఉంది. దీనిపై ఆలోచించిన  అధికారులు... బాలట్ పేపర్ ను స్కేల్ తో కొలిచి ఓటు ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ గుర్తు పైనే ఉందని నిర్ధారించి  తెరాస అభ్యర్థికి విజయం ప్రకటించారు. దీంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: