ఇపుడిదే పోస్టు వైరల్ గా మారింది. మొదటి నుండి  జగన్మోహన్ రెడ్డి విషయంలో  ఎల్లోమీడియా  అనుసరిస్తున్న వైఖరి వల్లే ఇపుడీ విషయంపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా ఉన్న  ఎల్లోమీడియా ప్రచారం అంటూ పోస్టులు విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. పోస్టులు సంగతిని పక్కనపెట్టినా వాస్తవం కూడా ఇలాగే ఉంది.

 

విచిత్రమేమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా జగన్ దే తప్పు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దే తప్పు అన్నట్లుగా ఉంది ఎల్లోమీడియా వ్యవహారం.  జగన్ కు సంబంధం లేని విషయాలను కూడా అంటగట్టేస్తు జగన్ పై బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టే కరోనా వైరస్ కన్నా ఎల్లోమీడియానే ప్రమాదకరమనే పోస్టులు హోరెత్తి పోతున్నాయి.

 

కరోనా వైరస్ హఠాత్తుగా  బయటపడింది. ఆ వైరస్ కు రేపో మాపో మందు కూడా కనుక్కుంటారు. కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ కూడా పెద్ద ప్రమాదం కాదని వైద్యులు కూడా చెబుతున్నారు.  కానీ ఎల్లోమీడియా ప్రచారానికి మాత్రం మందులు దొరికి అవకాశం కనబడటం లేదన్నదే జనాలభిప్రాయం.  జగన్ ను గబ్బు పట్టించటమే లక్ష్యంగా  చాలా కాలంగా ఎల్లోమీడియా పావులు కదుపుతోంది. జగన్ నే కాదు అంతకుముందు వైఎస్ విషయంలో కూడా ఎల్లోమీడియా చంద్రబాబునాయుడు రక్షణ కోసమే వ్యవహరిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

చంద్రబాబు హయాంలో ఎన్ని తప్పులు చేసినా ఎల్లోమీడియాకు ఏమాత్రం పట్టలేదు. ఎంఎల్ఏల కొనుగోలు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి,  పథకాల్లో అవినీతి ఆకాశమంత ఎత్తు  పెరిగిపోయినా  ఎల్లోమీడియాకు ఏరోజూ పట్టలేదు. అదే ఎన్నికల్లో జనాలు జగన్ కు అఖండ మెజారిటి కట్టబెట్టగానే ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. చంద్రబాబును రక్షించటానికే ఎల్లోమీడియా 24 గంటలూ పనిచేస్తుండటం వల్లే జనాలకు తప్పుడు సమాచారం వెళుతోంది. కరోనా వైరస్ కు మందు ఈరోజు కాకపోతే రెండు రోజుల తర్వాత వస్తుంది. అదే ఎల్లోమీడియా బారినపడుతున్న లక్షలమంది జనాలు మాటేమిటి ? 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: