అదిలాబాద్ జిల్లా  నాగోబా  ప్రజాదర్బార్ లో ఎంపీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపురావు నాగోబా  ప్రజాదర్బార్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ అధికారులు ఆదివాసీలను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ సోయం బాపూరావు. అన్యం పుణ్యం తెలియని ఆదివాసీల మీద కేసులు పెడితే మంచిది కాదని... ఆదివాసీలు తిరుగుబాటు చేస్తే ఫారెస్ట్ అధికారులు కనీసం విధి నిర్వహణకు కూడా వెళ్ళలేరు అన్న విషయం మర్చిపోవద్దు అంటూ ఎంపీ సోయం బాపూరావు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎంపీ సోయం బాపూరావు. 

 

 

 తిరగబడితే భూములు ఉంటాయి పట్టాలు ఉంటాయి.. లేదంటే మీ భూములు మీకు ఉండదు అందుకే తిరగబడండి అంటూ అంటూ ఎంపీ ఆదివాసీలకు పిలుపునిచ్చారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివాసీలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటిని పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీలకు ఇస్తామన్న నిధులు  ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు అంటూ మంత్రి నిలదీశారు ఎంపీ సోయం బాపూరావు. ఎస్టీ జాబితా నుంచి ఆదివాసీలను ఎప్పటికైనా తొలగించి తీరుతాం అంటూ తెలిపారు. ఆదివాసీలను ప్రభుత్వం గుర్తించాలంటే ఐక్యంగా పోరాటం చేయాలని సూచించారు. 

 

 

 అయితే నాగోబా ప్రజాదర్బార్లో ఓవైపు ఎంపీ సోయం బాపూరావు ఆగ్రహంతో ఉగిపోయి రెచ్చిపోయి మాట్లాడుతుంటే అటు ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఎంతో సున్నితంగా బదులిచ్చారు. నాగోబా  ఉపాధి దేవాలయ నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని.. రాజ గోపురాలు గ్రానైట్ ఆర్చీల  నిర్మాణాలకు ఐదు కోట్ల రూపాయల పనులకు టెండర్లకు  ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆలస్యం జరిగిందని తెలిపారు. ఆదివాసీలు పోడు భూములు జోలికి ప్రభుత్వం రాబోదని తెలిపిన మంత్రి.. పోడు భూములకు హక్కు పత్రాలు కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు. మీ భూములు మీకు ఉంటాయి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి... సమస్య పరిష్కారం చేస్తారు  అంటూ మంత్రి ఆదివాసీలకు హామీ ఇచ్చారు. దీంతో వాదోపవాదాలు కాస్త సద్దుమణిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: