చైనాలో పుట్టిన ప్రాణాంతకమైన వైరస్ కరోనా . ప్రస్తుతం చైనా దేశాన్ని ప్రాణ భయంతో గజగజ వణికిస్తున్న ఈ వైరస్ అటు ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నది . ఇప్పటికే కరోనా వైరస్ భయంతో ఎంతోమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక చైనాలో అయితే కరోనా  వైరస్ కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇంకెంతో మంది కరోనా వైరస్ సోకి  ప్రాణభయంతోనే బతుకుతున్నారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చైనాలోని ఊహన్  నగరంలో మొదట కరుణ వైరస్ గుర్తించగా ప్రస్తుతం చైనా దేశవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. 

 

 

 ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ తమ దేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.చైనా నుంచి ఆయా దేశాలకు వస్తున్న ప్రజలను వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత దేశంలోకి రానిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు చైనా కు ఉండే విమాన సర్వీసులను కూడా పాక్షికంగా రద్దు చేసుకున్నాయి . ఇక అటు భారతదేశంలో కూడా కరోనా  వైరస్ అనుమానితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధి ఇండియాలోకి ప్రవేశించకుండా వైద్యులు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ భారతదేశంలోకి ప్రవేశించింది. 

 

 

 చైనాలో  ఇప్పటికే పట్టిపీడిస్తున్న కరోనా  భారతదేశంలో కూడా ప్రవేశించినట్లు వైద్యులు నిర్ధారించారు. దేశంలోనే మొదటగా కరోనా  వైరస్ కేసు ఒకటి నమోదైంది. కేరళలోని ఓ విద్యార్థికి కరోనా  వైరస్ సోకినట్లు నిర్ధారించారు  వైద్యులు. చైనా దేశంలోని ఊహన్  నగరంలో చదువుతున్న ఓ విద్యార్థిని చైనా నుండి కేరళకు రాగా ... ఆ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా  వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వైద్యులు ఆ విద్యార్థికి ప్రత్యేక వార్డులో  చికిత్సను అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: