ఢిల్లీలో గంటన్నరకు పైగా ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన షెడ్యూల్ ను మార్చుకున్నారు. మామూలుగా అయితే మోడితో భేటి తర్వాత జగన్ విజయవాడకు తిరిగి వచ్చేయాలి. కానీ దాదాపు గంటన్నర భేటి తర్వాత హఠాత్తుగా జగన్ తన షెడ్యూల్ ను మార్చుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటి అవ్వాలని డిసైడ్ అవ్వటమే షెడ్యూల్ మార్పుకు కారణం.

 

ఢిల్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ తర్వాత  మోడి అర్జంటుగా జగన్ ను పిలిపించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఏదో ఓ పది నిముషాలో లేకపోతే పావుగంటో భేటి జరుగుతుందని అనుకుంటే దాదాపు గంటన్నరసేపు మాట్లాడుకున్నారు. అంటే రాష్ట్రనికి సంబంధించిన కీలకమైన అంశాలు చాలానే చర్చకు వచ్చుండాలన్నది అర్ధమైపోతోంది. సరే మోడితో అంటే అంతసేపు మాట్లాడారు. మరి అమిత్ షా తో హఠాత్తుగా ఎందుకు అపాయిట్మెంట్ తీసుకుంటున్నారు ?

 

గడచిన మూడు నెలలుగా జగన్ కు మోడి అసలు అపాయిట్మెంటే ఇవ్వలేదు. ఇక అమిత్ షా అయితే మూడుసార్లు అపాయిట్మెంట్ ఇచ్చారు. అయితే తనను కలవటానికి వచ్చిన జగన్ ను కలవకుండానే అమిత్ అవమానించారు. జగన్ ను కవలటానికి ఇష్టపడని అమిత్ మరి ఎందుకు అపాయిట్మెంట్ ఇచ్చారో ఎవరికీ అర్ధం కావటం లేదు.  అందుకనే గడచిన మూడు నెలలుగా ఇటు మోడిని కానీ అటు అమిత్ ను కాని జగన్ కలవలేకపోయారు.

 

అయితే మారిన పరిస్ధితుల్లో మోడినే జగన్ ను పిలిపించుకోవటం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే ఊపులో అమిత్ ను కూడా జగన్ కలవబోతున్నారు. అందుకనే  బుధవారం రాత్రి ఢిల్లీలోనే ఉండి గురువారం ఉదయం కలిసి మధ్యాహ్నానికి విజయవాడకు తిరిగొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మూడు రాజధానుల తరలింపు, శాసనమండలి రద్దు తీర్మానం లాంటి కీలకమైన అంశాలు మోడితో చర్చించిన తర్వాత అమిత్ తో కూడా ఇవే అంశాలను చర్చించే అవకాశాలున్నాయి.  ఈ భేటి అయితే కానీ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: