క్షేత్రస్ధాయిలో ఒకటి జరుగుతుంటే  తెలుగుదేశంపార్టీ మీడియా ఇంకోటి చూపిస్తోంది. ఆదివారం సాయంత్రం బాపట్ల ఎంపి నందిగం సురేష్ కారు మీద కొందరు మహిళా పెయిడ్ ఆర్టిస్టులు దాడి చేస్తే  అమరావతి మహిళలపై సురేష్ తో పాటు వారి అనుచరులు దాడి చేసినట్లు చంద్రబాబు మీడియా మొదటి పేజిలో ప్రముఖంగా అచ్చేశారు. బాపట్ల వైపు నుండి సురేష్ తన మద్దతుదారులతో గుంటూరు వైపు వెళుతున్నారు. ఆ సమయంలో లేమల్లె గ్రామం దగ్గర ట్రాఫిక్ కారణంగా కారును ఆగింది.

 

అదే సమయంలో ఎదురుగా అమరావతి జేఏసి ముసుగులో కొందరు మహిళలు బస్సులో వచ్చారు. కారులో ఎంపి ఉన్నట్లు గుర్తించిన మహిళలు వెంటనే బస్సు దిగేసి జై అమరావతి అని నినాదాలు ఇవ్వాలంటూ కారును చుట్టుముట్టారు. అందుకు ఎంపి, మద్దతుదారులు నిరాకరించటంతో తమ వెంట తెచ్చుకున్న కారంపొడిని మద్దతుదారులపై చల్లారు. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తతలు మొదలైపోయింది.

 

సరే పదిమంది ఒకచోట చేరిన తర్వాత తోపులాటలు, అరపులు, కేకలు సహజమే. ఇంతలో పోలీసులు వచ్చి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారులేండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపి సురేష్, మద్దతుదారులపై బస్సులోని ఆడవాళ్ళు దాడి చేసిన విషయం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులో నుండి కొందరు ఆడవాళ్ళు దిగి సురేష్ తో పాటు మద్దతుదారులతో గొడవ పడటం స్పష్టంగా కనిపిస్తోంది.

 

వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మీడియాలో మాత్రం ఎంపి మద్దతుదారులే బస్సులోని ఆడవాళ్ళపై దాడి చేసినట్లు చిత్రీకరించటమే విచిత్రంగా ఉంది. బస్సులో మహిళలు రాజధాని గ్రామాలవైపు వెళుతుంటే ఎంపి తో పాటు మద్దతుదారులు ఆడవాళ్ళని తిట్టినట్లు, బస్సులోకి వెళ్ళి కారం చల్లినట్లు, వాళ్ళని బస్సులో నుండి దిగకుండా డోర్ దగ్గర డ్రమ్ములు అడ్డంపెట్టినట్లు చిత్రవిచిత్రమైన కతలు అల్లేశారు. అంటే జరిగింది ఏమైనా కానీ తాము మాత్రం రివర్స్ లోనే రాయాలని నిర్ణయించుకున్నట్లే కనిపిస్తోంది. అందుకనే టిడిపి వాళ్ళే ప్రత్యర్ధులపై దాడులు చేస్తుంటే ప్రత్యర్ధులే మహిళలపై దాడులు చేస్తున్నట్లు రాస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: