మామూలుగా అయితే కొంతమంది మహిళలు ఒక కాన్పులో ఒక శిశువుకు జన్మనిస్తు ఉంటారు... కొన్ని కొన్నిసార్లు మహిళలు ఒకే కాన్పులో ఇద్దరికీ జన్మనిస్తూ ఉంటారు. ఇదంతా సర్వసాధారణం. కానీ ఒకే కాన్పులో ఇద్దరి కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చారు అంటే అది అరుదైన ఘటన అని చెప్పాలి. ఎందుకంటే ఓకే కాన్పులో మహిళ ముగ్గురు లేదా నలుగురు శిశువులకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇది చూసిన డాక్టర్లు కూడా కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్య పోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇంతకీ ఇక్కడ ఉన్న మహిళ ముగ్గురు నలుగురు శిశువులకు జన్మనిచ్చింది అనుకుంటున్నారా అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే ఇక్కడ ఆ మహిళ జన్మనిచ్చింది ముగ్గురు నలుగురు శిశువుల కాదు ఏకంగా ఆరుగురు శిశువులకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది మహిళ. ఇక ఈ ఘటన తో అటు వైద్యులు కూడా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అరుదైన ఘటనను తాము కూడా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు వైద్యులు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కి అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో మహిళ ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది. శనివారం శయేపూర్లోని జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఈ సందర్భంగా ఆ మహిళకు ప్రసవం చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు.
సదరు మహిళ ఏకంగా ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే జన్మించిన ఆరుగురు శిశువులలో ఇద్దరు శిశువులు వెంటనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇక మిగతా నలుగురూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నలుగురు శిశువులను సిక్ న్యూబర్న్ కేర్ యూనిట్ లో నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షణలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఒకే కాన్పులో ఆరుగురు జన్మించారని చెప్పగానే 22 ఏళ్ల ఆ తల్లి ఒక్కసారిగా షాక్కు గురైందని ఆసుపత్రిలో సిబ్బంది తెలిపారు. ఇక ఆరుగురు శిష్యులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ ద్వారానే ప్రసవం జరిగింది అంటూ వైద్యులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం బతికి ఉన్న నలుగురు శిశువుల బరువు 500 గ్రాముల నుంచి 790 గ్రాముల వరకు ఉన్నట్లు ఆస్పత్రి డాక్టర్ ఆర్.బి గోయల్ తెలిపారు. అయితే తాము కూడా ఇలా ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనివ్వడం తొలిసారి చూస్తున్నామని తెలిపారు వైద్యులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి